20.7 C
Hyderabad
December 10, 2024 01: 31 AM
Slider ఆంధ్రప్రదేశ్

కోడెల కొట్టేసిన ఫర్నీచర్ జాబితా ఇది

kodela furneture

ఆంద్రప్రదేశ్ అప్పటి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అక్రమంగా తరలించిన ఫర్నీచర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసింది. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నీచర్ తరలించే క్రమంలో తన హస్తలాఘవం చూపించగా చంద్రబాబు అధికారం పోయిన తర్వాత కోడెలను పట్టుకున్నారు. కోడెల కుమారుడు శివరామ్ నిర్వహిస్తున్న ఓ షోరూమ్ లో ఈ ఫర్నీచర్ ను గుర్తించిన అధికారులు విస్తుపోయారు. రూ. 70 లక్షల విలువైన డైనింగ్ టేబుల్ నుంచి, ప్లాస్టిక్ కుర్చీల వరకూ అక్కడ చూశారు. మొత్తం ఫర్నీచర్ ను స్వాధీనం చేసుకుని అమరావతి తరలించారు. ఇక ఈ షోరూమ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫర్నీచర్ లో వైట్ ప్లాస్టిక్ కుర్చీలు 27, బ్రౌన్ ప్లాస్టిక్ కుర్చీలు 9, పికాక్ చైర్లు 14, డైనింగ్ టేబుల్ గ్లాస్ 1, త్రీ సీటర్ ఐరన్ చైర్ల సెట్లు 3, త్రీ సీటర్ సోఫా సెట్లు 3 ఉన్నాయి. వీటితో పాటు కంప్యూటర్ టేబుల్ 1, బీఏసీ టేబుల్ టాప్ 1, ఉడెన్ కప్ బోర్డులు 2, గ్రీన్ చైర్లు 22, టేబుల్స్ విత్ సైడ్ ర్యాక్స్ 7, టీపాయ్ 1, డైనింగ్ టేబుల్ 1 తదితరాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  లో ఆంధ్రప్రదేశ్ కురావాల్సిన ఫర్నీచర్ వాటా ను కోడెల ఈ విధంగా కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ఇటాలియన్ ఫర్నీచర్ కాగా వీట విలువ దాదాపుగా కోటి రూపాయల పైనేఉంటుందని అంచనా.

Related posts

కంటతడి పెట్టించే కరోనా మృతుడు ఎన్టీవీ మధు ఆడియో

Satyam NEWS

ఆ  న‌లుగురు …

Satyam NEWS

జై తెలంగాణ: వందేళ్ల ప్రగతి ఆరేళ్లలోనే సాధించాం

Satyam NEWS

Leave a Comment