30.7 C
Hyderabad
April 19, 2024 08: 38 AM
Slider సంపాదకీయం

ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థకు అగ్నిపరీక్ష

#Judiciary

ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థ అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నది. అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక వ్యక్తులు ముసుగు తీసేసి నేరుగా న్యాయవ్యవస్థ ను ఎదిరిస్తున్నారు.

ప్రభుత్వంలో అత్యంత కీలక వ్యక్తులైన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ న్యాయవ్యవస్థను ప్రశ్నించే విధంగా మాట్లాడిన నాటి నుంచి కోర్టులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నాయకులు కూడా అదే తీరుగా మాట్లాడుతున్నారు.

రాజకీయ నాయకులకు న్యాయమూర్తులు సమాధానం చెప్పే వీలులేదు

 న్యాయవ్యవస్థ ఈ ఆరోపణలకు నేరుగా సమాధానం చెప్పలేదు సరికదా ఇలాచేయవద్దని కూడా నేరుగా చెప్పే వీలు న్యాయస్థానాలకు గానీ, న్యాయమూర్తులకు గాని ఉండదు.

న్యాయమూర్తులు రాజకీయ నాయకులతో నేరుగా తలపడే వీలు ఉండదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ను పునర్ నియమించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే న్యాయ వ్యవస్థపై విద్వేషపూరితమైన కామెట్లతో సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.

న్యాయమూర్తులను దారుణంగా విమర్శించారు. అయితే ఈ చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా చేయలేదు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఎకౌంట్ల నుంచి జరిగిన ఈ పనిని చాలా మంది మేధావులు ఖండించారు. కొందరు కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని అభిప్రాయపడ్డారు.

ఆ 93 కేసులు ఏమయ్యాయో….?

హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగా హైకోర్టు దీనిపై స్పందించి వారికి నోటీసులు జారీ చేసింది. వారిపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర పోలీసు వ్యవస్థకు నేరుగా చెప్పింది. 93 మందిని గుర్తించి వారికి సమాధానం చెప్పాల్సిందిగా నోటీసులు జారీ చేసినా వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందనలేదు.

ఆ తర్వాత ఒక సందర్భంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్న వారిని తమ పార్టీ కాపాడుకుంటుందని ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి చెప్పారు. అన్నట్లుగానే జరుగుతున్నది. ఈ వ్యవహారం పక్కన పెడితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నది.

ఇప్పుడు ఏం చేయాలి?

అమరావతి భూములకు సంబంధించిన ఏసిబి కేసులో పేర్లు రాయవద్దని కోర్టు చెప్పినా కూడా చాలా మంది ఖాతరు చేయలేదు.

వారికి సంబంధించిన మీడియాలో కోర్డు ఆర్డన్ ను ఉల్లంఘిస్తూ వార్తలు రాశారు. రాష్ట్ర హైకోర్టు ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నదని కొత్తగా పుట్టుకువచ్చిన ఒక జర్నలిస్టు సంఘం ఏకంగా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. మరొక వైపు అమరావతి రైతుల కేసులు విచారణకు వచ్చాయి.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు న్యాయస్థానాలను ప్రభావితం చేస్తుందా? అనేది మరోప్రశ్న. బహుశ న్యాయ వ్యవస్థ కు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినన్ని చిక్కులు ఇప్పటి వరకూ ఎక్కడా వచ్చి ఉండవు. ఇప్పుడు ఏం చేయాలి?

Related posts

ఇలా గుంపులు గుంపులుగా …..మ‌రి అలాగైతే వైర‌స్ కు అడ్డ‌కట్ట ఎలా..?

Satyam NEWS

జ‌గ‌న‌న్న ఇళ్ల నిర్మాణంలో సాంకేతిక స‌మ‌స్య‌లు: ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వ్యాఖ్య‌

Satyam NEWS

నిరుపేద అమ్మాయి పెళ్లికి అండగా ఉప్పల

Satyam NEWS

Leave a Comment