32.2 C
Hyderabad
March 28, 2024 22: 03 PM
Slider జాతీయం

ఆర్‌జే‌డి లో ఎల్‌జే‌డి విలీనం

ljd merger with rjd

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీలో లోక్‌తాంత్రిక్ జనతాదళ్ (ఎల్‌జేడీ) పార్టీ విలీనమైంది. సీనియర్ సోషలిస్ట్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ తన సొంత పార్టీ అయిన ఎల్‌జేడీని లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీలో  విలీనం చేశారు. ఈ సందర్భంగా  శరద్ యాదవ్ మాట్లాడుతూ, విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేసినట్టు చెప్పారు. బీజేపీని ఓడిపించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన తరుణం ఇదేనని అన్నారు.  ప్రస్తుతం, యూనిఫికేషన్ అనేదే తమ ప్రాధాన్యతాక్రమమని, ఐక్య విపక్షానికి ఎవరు సారథ్యం వహించాలనేది తర్వాత ఆలోచిస్తామని ఆయన చెప్పారు. లాలూ, శరద్ యాదవ్‌లు 25 ఏళ్ల క్రితం ఎవరికి వారు విడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఇరుపార్టీలు ఏకం కావడంతో ఇద్దరు ఏకం అయినట్లు అయింది.

Related posts

శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం

Bhavani

వ్యవసాయ మోటార్లకు మీటర్లపై వామపక్షాల ఉద్యమం

Satyam NEWS

ఎమోషనల్ మూమెంట్: మోడీ మీరే మా పాలిట దేవుడు

Satyam NEWS

Leave a Comment