లాక్ డౌన్ లో లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ అనుబంధ రంగాల ప్యాకేజీ కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ఉందని, రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రుణమాఫీ చేయాలని అఖిలభారత రైతు సంఘాల పోరాటం సమన్వయ కమిటీ AIKSCC డిమాండ్ చేసింది.
రెండు నెలల లాక్ డౌన్ రైతులను ఎనలేని కష్టాలకు గురిచేసిందని, గిట్టుబాటు ధర లేక అప్పుల భారాల తో ఆత్మహత్యల పాలు అవుతున్నారని AIKSCC అభిప్రాయపడింది. ప్రధానమంత్రి 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతో తమకు జరిగిన నష్టం లో కొంత అయినా వస్తుందని రైతాంగం ఆశించారని, ఆర్థిక మంత్రి ప్రకటించిన వ్యవసాయ అనుబంధ రంగాల ప్యాకేజీ రైతులను నిరాశకు గురి చేసిందని AIKSCC తెలిపింది.
పంటలన్నీ రైతుల చేతికి వచ్చి మార్కెట్లో అమ్ముకోవాల్సిన సమయంలో లాక్ డౌన్ వల్ల వంటలు సవ్యంగా సేకరించు కోలేని పరిస్థితి ఏర్పడిందని, మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని వారననారు. పని వారు లేక రవాణా సౌకర్యం లేక పండ్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని AIKSCC వెల్లడించింది.
రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆర్ డి ఓ కి ప్రత్యేక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ జక్కుల, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.