39.2 C
Hyderabad
March 28, 2024 16: 05 PM
Slider ఆదిలాబాద్

స్థానిక కార్మికులకు అన్యాయం చేస్తున్న సిర్పూర్ పేపర్ మిల్లు

#TDP Adilabad

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పేపర్ మిల్లు లో స్థానిక  కార్మికులను  నియమించుకోవాలని టిడిపి డిమాండ్ చేసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు గుళ్లపల్లి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు పేరుతోనే అని ఆయన అన్నారు.

మన ఉద్యోగం అనే నినాదంతో యావత్ తెలంగాణ ప్రజానీకం పోరాడి సాధించుకున్న తరుణంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడ అన్యాయం జరగడం మంచిది కాదని ఆయన అన్నారు. కాగజ్ నగర్ లోని ఎస్ పి ఎం పేపర్ మిల్లు ఆసియా ఖండంలోనే నెంబర్ వన్ పేపర్ మిల్లు పరిశ్రమను టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  మూతపడ్డదని ఆయన అన్నారు.

స్థానికంగా ఉండే కార్మికులు, అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ప్రజల పోరాటం తో మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వమే 4 సంవత్సరాల తర్వాత పున ప్రారంభించారని ఆయన తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ యాజమాన్యానికి 10 సంవత్సరాల వరకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల రాయితీలు ఇచ్చారని ఆయన తెలిపారు.

ఎవరైనా ఉద్యోగ విరమణ అయినా అనారోగ్య సమస్యతో ఉన్న వారి కుటుంబంలోని వారికి ఒకరికి ఉద్యోగం కల్పిస్తారని అప్పటిలో కేటీఆర్ హామీ ఇచ్చారని ఆనంద్ తెలిపారు. ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటినా కూడా 260 పర్మినెంట్ స్టాప్ కానీ వర్కర్స్ ని ఈరోజు వరకు విధుల్లోకి తీసుకోలేదని ఆయన అన్నారు.

ఏదో ఒక సాకు చెబుతూ యాజమాన్యం పబ్బం గడుపుతోందని, ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను వలస తీసుకొచ్చి పని చేయిస్తున్నారని ఆనంద్ తెలిపారు. ఈ నెల 14వ తేదీన అఖిలపక్షం ఆధ్వర్యంలో JK పేపర్ మిల్లు ఎదుట నిరసన తెలుపుతున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి మీర్ సాధిక్ అలీ, కార్యనిర్వాహక కార్యదర్శి పరుచూరి సురేష్ కుమార్ మైనార్టీ సెల్ నాయకులు మోసిన్ బేగ్, జిల్లా నాయకులు చల్లూరి శంకర్ , పట్టణ అధ్యక్షులు రాజేష్ జిల్లా నాయకులు మక్బూల్, టి ఎన్ టి యు సి నాయకులు సత్యం తదితరులు పాల్గొన్నారు.

Related posts

జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్

Satyam NEWS

ప్రివిలేజి మోషన్ పై సమాధానం ఇచ్చిన రాహుల్ గాంధీ

Satyam NEWS

సీఎస్ నీలంసాహ్ని పదవీకాలం పొడిగించండి

Satyam NEWS

Leave a Comment