26.1 C
Hyderabad
May 15, 2021 04: 38 AM
Slider జాతీయం

మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ: కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌

#maharastraCM

కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో మహారాష్ట్రలో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు విధిస్తున్నట్టు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు.

బుధవారం రాత్రి 8 గంటల నుంచి వీటిని అమలు చేస్తామన్నారు. అత్యవసర సేవలకు ఇబ్బందీ ఉండదు.  కర్ఫ్యూ నుంచి వాటిని మినహాయిస్తున్నారు.

‘లాక్‌డౌన్‌’ అనే పదాన్ని ఉపయోగించకుండా… ఆ తరహా నిబంధనలను అమలు చేస్తామని ఉద్ధవ్‌ పేర్కొన్నారు. కరోనా బాధితులను రక్షించేందుకు కేంద్రం వాయుసేన సేవలను ఉపయోగించి సత్వరం ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని ఉద్ధవ్‌ కోరారు.

జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమలవుతుంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగడానికి వీల్లేదు. దుకాణాలను, బహిరంగ ప్రదేశాలను మూసివేస్తారు.

ఇళ్లలో పనిచేసేవారు, డ్రైవర్లు, సహాయకులు యథావిధిగా పనులు చేసుకోవచ్చా? లేదా? అన్నది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధికారులు నిర్ణయిస్తారు.

ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, ఔషధ దుకాణాలు, వ్యాక్సినేషన్‌ కేంద్రాలు సహా… కూరగాయలు, కిరాణా దుకాణాలు, ఆహారశాలలకు మినహాయింపు ఇచ్చారు.

ప్రజా రవాణాకు ఇబ్బంది ఉండదు. విమానాలు, రైళ్లు, ఆటోలు, బస్సులు తిరుగుతాయి. సెబీ, ఆర్‌బీఐ, ఈ-కామర్స్‌, రవాణా-కార్గో తదితర సేవలు కొనసాగుతాయి.

Related posts

ప్రియుడి ఇంటి ముందు ప్రియరాలు ధర్నా

Satyam NEWS

నరసరావుపేటలో వైసిపి ఆధ్వర్యంలో భోగి మంటలు

Satyam NEWS

‘‘అధర్మ పాలన మనల్ని మింగేసే కాడికి వచ్చింది’’

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!