27.7 C
Hyderabad
April 18, 2024 10: 29 AM
Slider ప్రత్యేకం

లాక్ డౌన్ అంటే ఏమిటి? ఏమి మూసేస్తారు?

lockout

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 75 జిల్లాలలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అంటే ఏమిటి? ఏం తెరిచి ఉంచుతారు? ఏం మూసి ఉంచుతారు? మనం ఏం చేయాలి అనే సందేహాలు వస్తుంటాయి. ఈ నెల 31 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించారు.

దీనికి సంబంధించి ఆ‌యా ప్రభుత్వాలు ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఉత్తర్వుల్లో మొత్తం 22 అంశాలను పేర్కొంది. బ్యాంకులు, ఏటీఎంలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, టెలికాం, తపాలా, అంతర్జాల సేవలు, ఆస్పత్రులు, ఆప్టికల్‌ దుకాణాలు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, ఫార్మా, తయారీ, రవాణాకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.

అలాగే నిత్యావసర వస్తువుల రవాణా, సప్లై చైన్‌, గ్రాసరీస్‌, పాలు, బ్రెడ్‌, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, వాటి రవాణా, రెస్టారెంట్లలో టేక్‌ అవే, హోం డెలివరీ, పెట్రోల్‌, బంకులు, ఎల్పీజీ గ్యాస్‌, ఆయిల్‌ ఏజన్సీస్‌, గ్యాస్‌ గోడౌన్లు, సంబంధిత రవాణ, ప్రైవేట్‌ సహా అన్ని సెక్యూరిటీ సేవలు, కరోనా నివారణకు ఉపయోగపడే ప్రైవేట్‌ సంస్థలు, విమానాశ్రయాలు, సంబంధిత సేవలను ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.

పూర్తిస్థాయిలో పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలుగా జిల్లా కలెక్టరేట్లు, డివిజినల్‌, మండల కార్యాలయాలు, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖ ఉంటాయి. అదే విధంగా పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థలు, అగ్నిమాపక శాఖ, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, రవాణా కార్యాలయాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల పన్నుల కార్యాలయాలు, విద్యుత్‌, నీటిసరఫరా కార్యాలయాలు,

వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థశాఖ కార్యాలయాలు, మత్స్య, మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖ కార్యాలయాలు, కాలుష్య నియంత్రణ మండలి, తూనికలు కొలతల శాఖ కార్యాలయాలు, ఔషధ నియంత్రణ సంస్థకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు లభించింది. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు రవాణా వ్యవస్థ నిలుపుదల చేస్తారు. హైదరాబాద్ లో విమాన సర్వీసులు బంద్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అంతర్రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థ ను మూసివేశారు. రాష్ట్ర సరిహద్దులు బంద్ చేశారు. రాష్ట్రంలో బస్సులు, ఆటోలు, ఇతర ప్రజా, ప్రైవేట్‌ రవాణా వాహనాలు, పాఠశాలలు, కళాశాలలు, అన్ని విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్‌ క్లబ్‌లు, సోషల్‌ ఈవెంట్‌ సెంటర్లు,

పెద్ద పెద్ద ఆలయాల్లో దర్శనాలు, వస్త్రదుకాణాలు, జ్యూయలరీ షాపులు, అత్యవసరం కాని అన్ని ఇతర షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సర్వీసులు అందించేవి మినహా ఇతర ఆఫీసులు, గోదాములు,మార్కెట్‌ యార్డులు మూసివేస్తారు.

31వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రతిఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇల్లు విడిచి బయటకు రాకూడదు. తెరిచి ఉంచేవి పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలు, మందుల షాపులు, పాలు, కూరగాయలు, కిరాణా షాపులు.  అత్యవసర సేవలకు మాత్రమే ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి.

అప్పుడు కూడా కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి. ప్రభుత్వ ఆఫీసులు స్కెలెటిన్‌ స్టాఫ్‌తో రొటేషన్‌ పద్ధతిలో పనిచేయాలి. విద్యాసంస్థలు, మాల్స్‌ మూసివేయాలి. రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నింటినీ మార్చి 31వరకు మూసివేస్తారు. టెన్త్‌ పరీక్షలు మాత్రం యథాతధం. అక్కడ కూడా విద్యార్థుల మధ్య కనీసం రెండు మీటర్లు దూరం ఉండేలా చూడాలని ఆదేశాలు. ఎవరైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడుతుంటే వారిని ప్రత్యేక గదిలో ఉంచి పరీక్షలు రాయించాలి.

Related posts

రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ లకు బడ్జెట్ కేటాయింపు లేవి?

Satyam NEWS

కరోనా కాలంలో ఇంత తక్కువ కూలి ఇస్తే ఎలా?

Satyam NEWS

ఇళ్ల స్థలాలకు ఇచ్చే అధికారం మీకెక్కడిది?

Satyam NEWS

Leave a Comment