39.2 C
Hyderabad
March 29, 2024 15: 15 PM
Slider మహబూబ్ నగర్

లాక్‌డౌన్‌ అమలు తీరును పర్యవేక్షించిన వనపర్తి జిల్లా ఎస్పీ

#WanaparthyPolice

వనపర్తి జిల్లా కేంద్రంలోని బస్టాండ్  వివేకానందచౌరస్తా, ఎకోపార్క్,రాజీవ్ చౌరస్తా, గాంధీ చౌక్, మెయిన్ రోడ్లలో లాక్ డౌన్ అమలు తీరును వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు పర్యవేక్షించారు. వనపర్తి పట్టణ ఎస్సై,మధుసూదన్, పోలీసు సిబ్బందితో ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎవరు బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అవసరం అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని ప్రజలు ఎటువంటి అవసరాలు పనులు ఉన్న ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు చేసుకోవాలని ఆ తర్వాత బయటకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ  తెలిపారు. వాణిజ్య సముదాయాల ముందు భౌతిక దూరం సూచించే మార్కింగ్ ఏర్పాటు చేసుకునే విధంగా యజమానులను ప్రోత్సహించాలని సూచించారు.

మాస్కులు ధరించకుండా భౌతిక దూరం సూచించే సూచికలను ఏర్పాటు చేసుకోకుండా మెడికల్ షాపు నిర్వహిస్తున్న పలువురి షాప్ యజమానులను చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు మార్కింగ్ చేయని షాపు యజమానులతో మార్కింగ్  చేయించాలన్నారు. 

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో   జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, వనపర్తి పట్టణ ఎస్సై మధుసూదన్, పోలీసుసిబ్బంది ఉన్నారు. 

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

వైన్స్ షాపుల వద్ద మద్యం ప్రియుల భారీ క్యూ

Satyam NEWS

బాలకృష్ణ ను దూరం పెట్టిన చిరంజీవి అండ్ కంపెనీ

Satyam NEWS

జగన్ ప్రభుత్వ హాయాంలో జర్నలిస్టుల పై దాడులు జరగడం అన్యాయం…!

Bhavani

Leave a Comment