27.7 C
Hyderabad
March 29, 2024 02: 00 AM
Slider సంపాదకీయం

లాక్ డౌన్ ఉన్నా కొనసాగిన తబ్లీఘ్-ఈ-జమాత్‌ సదస్సు

nizamudden 311

ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్‌లో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్నది. నిజాముద్దీన్‌ మర్కజ్ మసీదులో మార్చి 10న జరిగిన తబ్లీఘీ-జమాత్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించడంతో యుద్ధ ప్రాతిపదికన పోలీసులు రంగంలో దిగారు.

పలు దేశాల మత ప్రచారకులు తబ్లీఘీ-జమాత్‌కు హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్‌తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు దీనికి హాజరు అయ్యారు. దేశవ్యాప్తంగా బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసులకు మూలం తబ్లీఘ్-ఈ-జమాత్ అని నిర్ధారణ అయింది.

ఇప్పటి వరకూ తెలంగాణ, కాశ్మీర్ లో మరణించిన వారంతా ఈ సభకు హాజరైనవారే. అదే విధంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికులు ఈ సభకు హాజరైనవారే.

లాక్‌డౌన్ ఆంక్షల తర్వాత కూడా తబ్లిఘ్-ఈ-జమాత్ కార్యక్రమాలు కొనసాగడం ఇక్కడ విశేషం. దాంతో ఈ సదస్సు నిర్వాహకులపై లాక్‌డౌన్ ఉల్లంఘన కేసును ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. కరీంనగర్‌లో బయటపడ్డ ఇండోనేషియా వాసులు కూడా తబ్లీఘ్-ఈ-జమాత్‌కు హాజరైనవారే.

Related posts

రాజకీయాలు చేస్తున్న రాష్ట్ర గవర్నర్

Satyam NEWS

గ‌ర్భీణీ స్ర్తీలు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

Sub Editor

రైతులను పట్టించుకోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment