Slider ప్రత్యేకం

ఉపాధి ఉద్యోగాల కల్పన ఒక సవాల్ గా స్వీకరిస్తా

#lokesh

హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కు మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానని ఆయన తెలిపారు. అదే విధంగా ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని లోకేష్ తెలిపారు. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాను. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను. రాష్ట్రానికి ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు  ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాను అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Related posts

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు

Satyam NEWS

ప్రొటెస్టు: 24వ రోజుకు చేరిన ఎన్ఆర్ సి నిరసనలు

Satyam NEWS

BJP vs TRS T20: బాల్స్ తక్కువ కొట్టాల్సిన రన్స్ ఎక్కువ

Satyam NEWS

Leave a Comment