32.2 C
Hyderabad
March 28, 2024 21: 22 PM
Slider కర్నూలు

తెలుగుగంగ ప్రాజెక్టును సందర్శించిన లోకేష్

#lokesh

రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నయ్ ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన తెలుగు గంగ ప్రాజెక్టును యువనేత నారా లోకేష్ సందర్శించారు. పాదయాత్రలో భాగంగా వెలుగోడు చేరుకున్న లోకేష్ ఆసియాలో అతిపెద్దదైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (తెలుగుగంగ)ను సందర్శించారు. 16.4 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ ద్వారా రాయలసీమలోని 1.75లక్షల ఎకరాలకు సాగునీరు, చెన్నయ్ కి తాగునీరు అందుతోంది. 1996 సెప్టెంబర్ 23న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి తొలిసారిగా చెన్నయ్ కి నీళ్లు వెళ్లాయి. దివంగ ఎన్టీఆర్, చంద్రబాబునాయుడుల ముందుచూపు, వారికి కరువుసీమపై వారికున్న ప్రేమకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని యువనేత లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెలుగోడు రిజర్వాయర్ దిగువన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Related posts

కబాలి సినీ నిర్మాత చౌదరి అరెస్ట్

Bhavani

ఏ మాత్రం ఆత్మాభిమానం లేని లక్ష్మీపార్వతి

Satyam NEWS

43 కేంద్రాల్లో 15 వేల 388 మంది పరీక్ష రాస్తున్నారు…!

Satyam NEWS

Leave a Comment