లోక్ సత్తా వ్యవస్థాపకుడు డా. జయప్రకాశ్ నారాయణ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఒక ప్రయివేటు కార్యక్రమానికి వెళుతూ హైదరాబాద్ లోని జూబ్లీ చెక్ పోస్ట్ కూడలిలో సిగ్నల్ పడటంతో ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగింది. వెంటనే వెనుక వైపు నుంచి వచ్చిన ఆటో బలంగా ఢీకొనడంతో కారు టైరు పేలడంతో పాటు కారు వెనుక భాగం అంతా పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆటోలో ఉన్న ఆడవాళ్ళకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద దాదాపు అర గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో జే.పీ. తో పాటు వై.బీ.ఐ. అధ్యక్షుడు మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు.