39.2 C
Hyderabad
April 25, 2024 17: 07 PM
Slider ప్రపంచం

మృత్యువాత పడిన12 అడుగుల భారీ తిమింగళం:బీచ్‌ లోకి నో ఎంట్రీ

long fin whale washes up dead on uk beach

మృత్యువాత పడిన ఓ 12 అడుగుల భారీ తిమింగళం యూకేలోని టీసైడ్‌ నదీ తీరానికి కొట్టుకురావడం తో అధికారులు అప్రమత్తమయ్యారు.మింక్‌ జాతికి చెందిన ఈ 12 అడుగుల భారీ తిమింగళం విషయాన్ని బ్రిటీష్‌ అధికారులు గురువారం ధృవీకరించారు. తిమింగళం అవశేషాన్ని అక్కడి నుండి తొలగించేవరకు ప్రజలు ఎవరు బీచ్‌ వద్దకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్రిటీష్‌ డైవర్స్‌ మెరైన్‌ లైఫ్‌ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది.

కాగా బుధవారం జూన్‌ 2న బీచ్‌కు వచ్చిన ఫియోనా రౌబోత్‌ అనే మహిళకు కొద్ది దూరంలో ఈ పెద్ద తిమింగళం కనిపించిదని.కానీ అది అప్పటికే చనిపోయిందని తెలిపూతూ దానికి సంబంధించిన ఫోటోలను కూడా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. మహిళ షేర్‌ చేసిన ఫోటో ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు తిమింగళం ను గుర్తించి దాని మృతికి గల కారణాలను కూడా అన్వేషించే పనిలో పడ్డారు. కాగా మింక్‌ జాతి తిమింగళాలు 9 నుంచి 10 అడుగుల పొడవు వరకు మాత్రమే ఉంటాయని వేల్‌ అండ్‌ డాల్ఫిన్‌ పరిరక్షణ కమిటీ పేర్కొంది. తాజాగా బయటపడిన 12 అడుగుల భారీ తిమింగళం మింక్‌ జాతిలో అతి పెద్దదని అధికారులు పేర్కొన్నారు.

Related posts

మాదగలకు మంత్రివర్గంలో స్థానం కావాలి

Satyam NEWS

ఓ క‌లం వీరుడా ఇంకిపోవ‌డం త‌ప్ప ఒరిగిందేమీ లేదు

Satyam NEWS

పాలేరు అసెంబ్లీ నుండి సిపిఎం పోటీ

Satyam NEWS

Leave a Comment