27.7 C
Hyderabad
April 26, 2024 03: 25 AM
Slider నల్గొండ

పోలీస్ అభ్యర్థులకు ఈవెంట్స్ లో లాంగ్ జంప్ దూరాన్ని తగ్గించాలి

# police candidates

దేశ రక్షణ కొరకు పనిచేస్తున్న జవాన్లకు 300 వందల మీటర్ల లాంగ్ జంప్ ఉందని,మరి మన దేశంలో ఏ రాష్ట్రాలలో లేని కఠిన నిబంధన మన రాష్ట్రంలోనే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారు కొత్త నిబంధనలు పెట్టి పోలీస్ అభ్యర్థులకు ఈవెంట్స్ లో ఇబ్బంది పెడుతున్నారని,ఇది చాలా దారుణమని, ఈ నిబంధనలను తొలగించాలని ఫిర్యాదు చేసినట్టు టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండి అజీజ్ పాషా శనివారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ కఠిన నిబంధనల ద్వారా చాలామంది నిరుద్యోగ యువకులు నష్టపోతున్నారని,ఆవేదన వ్యక్తం చేశారు.

పాత పద్ధతిలోనే ఎస్సై,కానిస్టేబుల్ దేహదారణ్య పరీక్షలలో లాంగ్ జంప్ ను 400 నుండి 300 వందలకు వరకు దూరాన్ని తగ్గించాలని,షాట్ ఫూట్ 600 మీటర్ల నుండి 5.50 మీటర్లకు కుదించాలని కోరారు.రాష్ట్ర డిజిపి, హోంమంత్రి పునః పరిశీలన చేసి కఠిన నిబంధనలను తొలగించాలని అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడకుండా చూడాలని,అర్హత కోల్పోయిన పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయాలని తన ఫిర్యాదులో కోరినట్లు ఎండి అజీజ్ పాషా తెలిపారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

తెలంగాణ అమరులకు సైబరాబాద్ పోలీసులు నివాళి

Bhavani

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

Satyam NEWS

నరసరావుపేటలో ఎంఐఎం నేతల నిరసన

Satyam NEWS

Leave a Comment