33.2 C
Hyderabad
April 25, 2024 23: 41 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ఎస్బీఐ ముందు ప్రజలకు తప్పని తిప్పలు

#SBIKollapur

ప్రభుత్వం ఏమైనా పథకాలు ప్రవేశపెట్టి బ్యాంకులకు వెళ్లి తీసుకోండి అంటే అప్పుడు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇదివరకు చూశాం. బ్యాంకుల ముందు భారీ క్యూ కడతారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ఇచ్చినప్పుడు రైతులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. లాక్ డౌన్ సమయంలో లో పదిహేను వందల రూపాయల కోసం కూడా పడిగాపులు కాశారు. ఇప్పుడు లాక్ డౌన్ ముగిశాక కూడా ప్రజలను బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వచ్చింది.

బ్యాంకులో పని కావాలంటే కిటికీల నుండి పని చేసుకోవాల్సిందే. బ్యాంకులో తక్కువ సిబ్బంది ఉంటారు. సిబ్బందికి కరోనా వస్తే సేవ చేసేది ఎవరని వారు ఆలోచన చెయ్యవచ్చు. కానీ  బ్యాంకులకు ప్రజలను అనుమతించకుండా బయట నిలబెట్టి కీటికీల నుండి సేవలదించడం ఏమిటో అర్ధం కావడం లేదు.

ప్రజలు ఇలా బ్యాంకుల ముందు ఒకరిపై ఒకరు పడుతూ పడిగాపులు కాస్తుంటే ఎవ్వరికి పట్టడం లేదు. ఇదంతా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని  అంబేద్కర్ చౌరస్తా  దగ్గర ఉన్న ఎస్బిఐ (పాత ఏస్బీహెచ్) బ్యాంక్ లో జరుగుతున్న వ్యవహారం.

లావాదేవీల కోసం వచ్చిన ఖాతాదారులను  ఎండలో నిలబెట్టి కిటికీలో నుంచి వారు సేవలందిస్తున్నారు. ఇది వరకు బ్యాంక్ లో కొందరికి కరోనా సోకింది. తర్వాత వారు కోలుకున్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా కరోనా వైరస్ వ్యాపించింది. అలా అని స్టేషన్ కు వచ్చిన వారిని దూరం చేయడం లేదు.

వారికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర కార్యాలయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకొని సేవాలందిస్తున్నారు. మరి ఈ బ్యాంకులో ఎందుకలా చేస్తున్నారని అడిగేవారు లేరు. కనీసం పాలకులైన ఆ వైపు చూడాలి.

వారికి అవగాహన కల్పించాలి. బ్యాంకు అధికారులు ఖాతాదారులను సామాజిక దూరం పాటిస్తూ  సేవాలందిచవచ్చు. ఇంత ఆలోచన బ్యాంకు వారికి ఎందుకు రావడం లేదో ఒక్క సారి పాలకులైనా గుర్తు చెయ్యాలి.

Related posts

తొర్రూరులో రూ.152 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు

Satyam NEWS

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు…!

Bhavani

యుద్ధం చేస్తూనే….

Satyam NEWS

Leave a Comment