కాకినాడ పోర్టును బలవంతంగా కొట్టేసిన కేసుకు సంబంధించి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేసింది. ఆయనతో పాటు వైకాపా ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డి, అరబిందో యజమాని పెనక శరత్ చంద్రారెడ్డిపైనా ఎల్వోసీ ఇచ్చింది. వీరు ముగ్గురూ విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని రూ.3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో వీరు కీలక నిందితులుగా ఉన్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కేవీ రావును బెదిరించి, భయపెట్టి అత్యధిక శాతం షేర్లను అరబిందో సంస్థ పరం చేశారనేది వీరిపై ప్రధాన అభియోగం.
previous post
next post