28.7 C
Hyderabad
April 20, 2024 10: 15 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ మున్సిపాలిటీ లో దొంగలు పడ్డారు

#Kollapur Municipality

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ లో నిధులు దుర్వినియోగం చేస్తున్న మున్సిపాలిటీ చైర్ పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి ను బర్తరఫ్ చేయాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు మేకల రమ్య నాగరాజు, శిరీష కిరణ్ యాదవ్, షేక్ రహీం పాషా ఆధారాలతో సహా చైర్ పర్సన్ అవినీతి భాగోతాన్ని వెలికి తెచ్చారు.

ఈ నెల 27న టెలీకాన్ఫరెన్సు ద్వారా సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసి తమ అవినీతిని ఆమోదింప చేసుకోవాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. మొత్తం 2.50 కోట్ల రూపాయలు కాజేయడానికి ఎజెండా రూపొందించుకున్నారని వారు తెలిపారు.

సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేసే ముందు కౌన్సిల్ సభ్యుల తో చర్చించి ఎజెండా చేయాలి కానీ సొంతంగానే చైర్ పర్సన్ ఎజెండా తయారు చేశారని వారన్నారు. నేరుగా సమావేశం ఏర్పాటు చేస్తే తాము ప్రశ్నిస్తామని, వారి అవినీతి బండారం బయటపడుతుందని ఊహించి కరోనా పేరుతో టెలీకాన్ఫరెన్సు ఏర్పాటు చేశారని వారన్నారు.

వారు తెలియచేసిన వివరాలు ఇవి:

కొల్లాపూర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో లో భాగంగా చైర్ పర్సన్ వార్డులో పారిశుద్ధ్య పనులు చేసినందుకు డోజర్ కిరాయి 5 లక్షలు అయ్యాయని బిల్లు పెట్టారు. కానీ చైర్మన్ వార్డ్ లో  ఎక్కడ కూడా కంపచెట్లు లేవు. డోజర్ తో క్లీన్ చేయడానికి మట్టి రోడ్లు లేవు.

మరి ఎలా 5 లక్షల ఖర్చు అయ్యాయి? ఇది కాకుండా 19, 20 వార్డులో జేసీబీ ఖర్చు 166000 అయ్యింది అని బిల్లు పెట్టారు. 80 శాతం పనులు కుడా చేయ లేదు. పట్టణ ప్రగతి పేరుతో మొత్తం వార్డ్ లకు గాను 23,45,930=00 ఖర్చు అయ్యాయి అని బిల్లులు పెట్టారు.

ఎడాపెడా దొంగ బిల్లులు

ఈదమ్మ తల్లి జాతర కు సంబంధించిన టెండర్  రద్దు ఐతే మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా ఏర్పాట్లు చేసి పన్నులు వసూలు చేశారు. దాని ద్వారా వచ్చిన ఆదాయం తో అక్కడ అభివృద్ధి పనుల కు ఉపయోగించాలి అని కౌన్సిల్ తీర్మానం చేసాం కానీ దానికి విరుద్ధంగా చైర్మన్ 100000 రూపాయలు కంపచెట్లు తొలగించి నందుకు, శివాలయం ముందర చెరువు కట్ట మీద మొరం వేశాము అని 100000 రూపాయలు జనరల్ ఫండ్ నుండి  ఇవ్వాలి అని ఎజెండా లో పెట్టారు.

నీటి మోటార్ల పేరుతో దోపిడికి యత్నం

కొల్లాపూర్ మున్సిపాలిటీ లో  మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది కానీ చైర్ పర్సన్ 10హెచ్ పి మోటార్, 5 హెచ్ పి మోటార్ కొనుగోలు చేసాం బిల్లు మంజూరు చేయాలి అని ఎజెండా లో చేర్చారు. మోటార్ లు రిపేర్ అయ్యాయి అని 50 వేలు బిల్లు పెట్టారు.  పాపం చైర్ పర్సన్ చాలా కష్ట పడుతున్నారు.

ప్రజా ధనం దుర్వినియోగం చేయడానికి అది ఎలా అంటే వారి చాంబర్ రూం సైజ్ (8×8) ఉంది అందులో pop చేయడానికి అక్షరాల 100000 రూపాయలు, pop చేసిన రూమ్ కి ఎలక్ట్రికల్ పని చేసినందుకు 100000 రూపాయలు, చైర్మన్ ఎండల్లో తిరిగి అలసిపోతున్నారు కాబట్టి ఛాంబర్లో AC కి 65000 వేల రూపాయలు, మొత్తంగా 2,60,000=00 ల ప్రజాధనానికి ఎసరు పెట్టారు.

కరోనా ప్రచారానికి రెండు లక్షలు ఫట్

మున్సిపాలిటీ కార్యాలయానికి తలుపులు, కిటికీలు, ఒక తలుపు ఏర్పాటు చేసినందుకు 1,00,000=00 చెల్లిస్తున్నారు. పట్టణ ప్రగతి సమీక్షా సమావేశం ఫంక్షన్ హాల్ లో ఒక గంట ఏర్పాటు చేసినందుకు బిల్లు 32000=00 రూపాయలు అయిందట.

కరోనా ప్రచారానికి  ఒక ఆoపిల్ ఫైర్,5 పొంగలు ఏర్పాటు చేసినందుకు 1,91,900=00రూపాయలు బిల్లు చెల్లించాలి అని ఎజెండాలో పెట్టారు. ఇంకో విషయం ఏమిటంటే కొల్లాపూర్ మున్సిపాలిటీ కి ఒక సొంత ట్రాక్టర్ ఉంది. దానికి డిసెంబర్ నెలకు డీజల్ కు 76,585 రూపాయలు ఖర్చు అయిందట.

జనవరిలో 59,353=00, ఫిబ్రవరి కి 53,695=00, మార్చిలో 69,477=00,ఏప్రిల్ లో 62,650=00 చెల్లించాలి. అంతే ఎంత డీజల్ తాగుతున్నారో??? ఈ ఎజెండాను తాము అంగీకరించే ప్రశ్నేలేదని కౌన్సిలర్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ మాచూపల్లి బాలస్వమి, జ్యోతి శేఖర్, శ్రీలక్ష్మి, వేణు, నయిం తదితరులు పాల్గొన్నారు.

Related posts

అయ్యగారు ఫుల్ బిజీ ఆయన చెబితే కానీ పని జరగదు

Satyam NEWS

చలో హైదరాబాద్ కు కదిలిన కార్మిక సైన్యం

Satyam NEWS

పువ్వాడను కలిసిన మదన్ లాల్

Bhavani

Leave a Comment