27.7 C
Hyderabad
April 24, 2024 10: 58 AM
Slider పశ్చిమగోదావరి

డీజిల్ ధర పెంపుపై లారీ ఓనర్ల నిరసన

#Jangareddygudem Protest

ఆంధ్రప్రదేశ్ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని, టోల్ రుసుమును రద్దు చేసి,  కరోనా విపత్కర సమయంలో  వాహన రవాణా పన్నుకు  (క్వార్టర్ టాక్స్) మినహాయింపు ఇవ్వడంతో పాటు, ఫైనాన్స్ వాయిదాలపై  ఇచ్చిన మారటొరీయం కాలానికి వడ్డీ  రద్దు చేయాలి వారు ప్రధానంగా డిమాండ్ చేశారు.

తమ డిమాండ్స్ నెరవేర్చుకపోతే నిరసన కార్యక్రమాలను మరింత కఠినతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజలు తమను అర్థం చేసుకుని సహకరించి మద్దతుగా నిలవాలని, తమ పోరాటం కేవలం లారీ అసోసియేషన్ కి సంబంధించినది మాత్రమే కాదని ప్రతి ఒక్కరి పై ఈ భారం పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం లారీ యూనియన్ ప్రెసిడెంట్ అట్లూరి సురేష్, సెక్రటరీ చింతల రాంబాబు, లారీ యజమానులు మరియు ఇతర కార్మికులు పాల్గొన్నారు.

Related posts

మహిళా దినోత్సవం సందర్భంగా 50 వేల మందితో మానవహారం

Satyam NEWS

విజయనగరంలో ఘనంగా ఆజాదీ కా అమృత మహోత్సవ్ ర్యాలీ

Satyam NEWS

క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ షెడ్యూల్ ఇదే

Satyam NEWS

Leave a Comment