28.7 C
Hyderabad
April 20, 2024 05: 15 AM
Slider హైదరాబాద్

జిన్నారం ఇంట్లో భారీగా మ‌ద్యం సీసాలు!!!

Rajasingh-4

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో చైత‌న్య‌పురిలో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. విష‌యాల్లోకి వెళితే.. చైత‌న్య‌పురి టీఆర్ఎస్‌ కార్పొరేట‌ర్ (గ‌తంలో) అభ్య‌ర్థి జిన్నారం విఠ‌ల్‌రెడ్డి ఇంట్లో భారీగా కార్టూన్ల కొద్దీ మ‌ద్యం సీసాలు దొర‌క‌డం వీటిని బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప‌ట్టుకోవ‌డం వివాదాస్పందమైంది.

బీజేపీ ఆఫీసు ధ్వంసం.. దాడుల‌కు తెగ‌బ‌డ్డ గులాబీ శ్రేణులు

ఈ నేప‌థ్యంలో తామ ఇలాకాలో వ‌చ్చి బీజేపీ కార్య‌క‌ర్త‌లు త‌మ గుట్టుర‌ట్టు చేస్తారా? అంటూ గులాబీ నేతుల‌, కార్య‌క‌ర్త‌లు చైత‌న్య‌పురి బీజేపీ కార్యాల‌యం ముందు ఆందోళ‌న‌కు దిగారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఆఫీసును ధ్వంసం చేశారు. అక్క‌డే ఉన్న‌కొంద‌రు కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవ‌డానికి చూస్తే వారికీ గాయాల‌య్యాయి.

తాపీగా పోలీసులు… ఎమ్మెల్యే రంగ ప్ర‌వేశం

ఈ విష‌యాన్నికాస్త అక్క‌డే ఉన్న పోలీస్ ఇన్‌ఫార్మ‌ర్లు, బీజేపీ కార్య‌క‌ర్త‌లు పోలీసు ఉన్న‌తాధికారుల‌కు, బీజేపీ ఎమ్మెల్యే (డేరింగ్ అండ్ డ్యాషింగ్‌) రాజాసింగ్‌కు తెలిపారు. పోలీసులు వ‌చ్చి ఇరు వ‌ర్గాల‌కు న‌చ్చ‌జెప్పి ఆందోళ‌న‌లు స‌ద్దుమ‌ణిగేందుకు లాఠీ చార్టీ చేప‌ట్టారు. అనంత‌రం సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న రాజా సింగ్ పోలీసుల‌ను నిల‌దీశారు. ఓ వైపు మ‌ద్యం పంచుతూ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న టీఆర్ఎస్ నేత‌ల‌ను వ‌దిలి త‌మ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌పై లాఠీచార్జీ చేయ‌టం ఏమిట‌ని పోలీసుల‌ను ప్ర‌శ్నించారు. త‌మ నేత‌లు ఎప్పుడూ న్యాయం వైపు ఉండ‌డ‌మే తాము చేసిన త‌ప్పా? అని నిల‌దీశారు.

కార‌కుల‌పై కేసు న‌మోదు..

గాయ‌ప‌డి ర‌క్త‌మోడుతున్న కార్య‌క‌ర్త‌తో పోలీసుల‌ను ప్ర‌శ్నిస్తుండ‌గా పోలీసులు రాజాసింగ్ ప్ర‌శ్న‌ల‌కు మౌనంగా స‌మాధానాలిచ్చారు. ఎవ‌రెవ‌రైతే ఉద్రిక్త‌త‌ల‌కు కార‌కులో వారంద‌రిపై చ‌ట్ట‌రీత్యా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నాని పోలీసులు రాజాసింగ్‌కు హామీనిచ్చారు.

చైత‌న్య‌పురికి విచ్చేసిన రాజాసింగ్ ముందుగా బీజేపీ పార్టీ కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. ముందుగా కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితిపై వాక‌బు చేశారు. కొద్దిపాటి గాయాల‌తో క్షేమంగా ఉన్న కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి కార్యాలయాన్ని సంద‌ర్శించారు. అనంత‌రం బీజేపీ కార్యాల‌య ధ్వంసానికి బాధ్యులు ఎవ‌ర‌ని ఆవేద‌న చెందారు.

జిన్నారం అభ్య‌ర్థిత్వం ర‌ద్దు చేయ‌కుంటే తీవ్ర ప‌రిణామాలు!

అక్క‌డే ఉన్న పోలీసు ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ జిన్నారం విఠ‌ల్‌రెడ్డి అరాచ‌కాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోతోంద‌ని వాపోయారు. ఇలాగే ఆయ‌న అరాచ‌కాలు కొన‌సాగిస్తే త‌మ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఊరుకునే ప‌రిస్థితిలో లేర‌ని ఇప్ప‌టికైనా అత‌నిపై కేసులు న‌మోదు చేసి అభ్య‌ర్థిత్వం ర‌ద్దు చేయ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని హెచ్చ‌రించారు.

కేటీఆర్ ఏం స‌మాధానం చెబుతారు?

ఈ నేప‌థ్యంలో రాజాసింగ్ ఎన్నిక‌ల సంఘం, పోలీసులు, అధికార ప‌క్షంపై ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా ఏదైనా టీఆర్ఎస్ త‌ర‌ఫు అభ్య‌ర్థులు గెలిచినా? ఓడినా? బాధ్య‌త తానే తీసుకుంటాన‌న్న మంత్రి కేటీఆర్ ఇప్పుడేం స‌మాధానం చెబుతార‌ని రాజాసింగ్‌ ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ప్ర‌లోభాల‌కు తెర‌తీశార‌నేది వాస్త‌వం కాదా? అని ప్ర‌శ్నించారు? మ‌ంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న ఓటింగ్ స‌ర‌ళిపై ఈ ప్ర‌భావం త‌ప్ప‌క ప‌డ‌నుంద‌ని రాజాసింగ్‌, పోలీసుల‌కు, అధికార పార్టీ నేత‌ల‌కు హెచ్చ‌రించారు.

Related posts

డ్యూటీ:కాన్వయ్ లో బాధితుడు ఆసుపత్రికి తరలింపు

Satyam NEWS

ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని కాపాడిన డిండి సిఐ

Satyam NEWS

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

Satyam NEWS

Leave a Comment