34.2 C
Hyderabad
April 23, 2024 14: 30 PM
Slider ఆదిలాబాద్

లోవోల్టేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామీణులు

#LowVoltage

కొమరంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమనేపల్లి మండలంలోని భురేపల్లి గ్రామంలో అదనంగా రెండు ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) ప్రతినిధులు AE రవీందర్ కు వినతి పత్రం ఇచ్చారు.

భురేపల్లి గ్రామ పంచాయితీ లో  ముడు గుడ్యాలు( పాత భురేపల్లి, క్రొత్త భురేపల్లి, బోగడా గూడ) ఉండగా పాత భురేపల్లి, క్రొత్త భురేపల్లి లలో మాత్రమే 15 కేవీ ల ట్రాన్స్  ఫార్మర్ లు ఉన్నాయి. దీన్ని మూలంగా లోడ్ ఎక్కువ అయి లోవోల్టేజ్  తో ఫ్యాన్లు, టీవీలు, బోర్లు, విద్యుత్ పరికరాలు కాలిపోతున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నది.

గతంలో కలెక్టర్, మండల MPDO, సంబంధిత అధికారులకు కూడా ఈ విషయాన్ని గ్రామస్తులు తెలియచేశారు. కాని సమస్య పరిష్కారం కాలేదు. మళ్లీ ఇప్పుడు వర్ష కాలం ప్రారంభం అయినందున కరెంట్ పోతే ప్రజలు బిక్కు బిక్కు మంటా భయాందోళనకు గురవుతున్నారు.

అందుకోసం వెంటనే భురేపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని DYFI కోరింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అల్లూరి దివాకర్, గందర్లా విజయ్ పాల్గొన్నారు.

Related posts

(2022) Cbd Hemp Store Charleston Sc Portable Cbd Hemp Plant Thc Content Tester

Bhavani

కొంతమంది పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదు

Satyam NEWS

లాండ్ పూలింగ్ కు భూములిస్తాం: ముందుకు వచ్చిన మేడిపల్లి దళితులు

Satyam NEWS

Leave a Comment