32.2 C
Hyderabad
April 20, 2024 21: 01 PM
Slider నల్గొండ

కరోనా కాలంలో ఇంత తక్కువ కూలి ఇస్తే ఎలా?

#Agriculture workers comittee

వేసవికాలంలో గ్రామీణ ఉపాధి హామీ పనిలో పనిచేస్తున్న కూలీలకు కొలతలు లేకుండా దినసరి కూలీ ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెల్మినేడు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ గత వారం ఎర్రటి ఎండలో పని చేసిన కూలీలకు రోజుకూలీ 160, 186 రూపాయలు మాత్రమే ఇచ్చారని అన్నారు.

బుక్క బుక్కకు నీళ్లు త్రాగి పనిచేసిన కూలీలకు ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మూలంగా గ్రామ పంచాయతీ వారు కూలీలకు మాస్క్లు శానిటైజర్ ను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తక్షణమే అధికారులు స్పందించి కూలీలకు మాస్కులు అందించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హమీ జాబ్ కార్డులో పేరు నమోదు కలిగి ఉన్న సిస్టంలో పేరు చూపించడం లేదని కూలీలు మరలా దరఖాస్తులు పెట్టుకోవాలని TA లు చెబుతున్నారని ఆయన అన్నారు.

ఈ నిర్ణయం సరికాదని జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలికి పనికోసం దరఖాస్తు చేసుకుంటే పని కల్పించాలని చట్టంలో ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా కూలీలకు ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చిట్యాల మండల అధ్యక్ష ,కార్యదర్శులు వలిగొండ జంగయ్య ,అరూరి నరసింహ ,నాయకులు మాజీ ఎంపిటిసి అరూరి శ్రీనివాస్ , దేశబోయిన నర్సింహ , రాములు , శంకరయ్య ,భారతమ్మ , అలివేలు , మంగమ్మ ,అండాలు , శశిరేఖ పద్మ  ,శ్రీశైలం , కవిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

కుట్రలు, కుతంత్రాలకు బీఆర్ఎస్ లో తావులేదు

Bhavani

ట్రాన్స్ఫర్: టీచర్ గంగయ్య సేవలు ప్రశంసనీయం

Satyam NEWS

తొలి ఏకాదశి విశిష్టత: ఆనందంతో పాటుగా ఆరోగ్యం

Satyam NEWS

Leave a Comment