31.2 C
Hyderabad
February 14, 2025 21: 17 PM
Slider ఆంధ్రప్రదేశ్

రైలులో హోంగార్డును చంపేసిన ఒక పిచ్చోడు

198891-scr-north

కదులుతున్న రైలు నుంచి హోంగార్డును కిందకు తోసేశాడు ఓ ఉన్మాది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. వైజాగ్ వైపు వెళ్లే బొకారో ఎక్స్ ప్రెస్ రైలులో ఈ దారుణం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలంతా ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. రైల్లో ఉన్న ప్రయాణికులను బయటకు గెంటేసేందుకు ప్రయత్నించాడు.

దీంతో అతడ్ని ఓ హోంగార్డు బలంగా అడ్డుకున్నారు. మరింత రెచ్చిపోయిన ఉన్మాది.. హోంగార్డును రైల్లో నుంచి కిందకు తోసేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన హోంగార్డు పేరు శివగా గుర్తించారు. అతడు కోటనందూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండేవాడని అధికారులు గుర్తించారు.

Related posts

నవంబరు 4న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

Satyam NEWS

ఫైనల్ జస్టిస్: నిర్భయ దోషులకు రేపు ఉరి ఖరారు

Satyam NEWS

నితిన్ పెళ్లాడుతున్నది నాగర్ కర్నూల్ అమ్మాయినే

Satyam NEWS

Leave a Comment