36.2 C
Hyderabad
April 25, 2024 22: 12 PM
Slider నల్గొండ

కొనసాగుతున్న యాదాద్రి ముఖ్య అర్చకుడి అన్నవితరణ

Madhavacharyulu

దేవుడు తనకు ఇచ్చిన దాంట్లో పది మందికి పెడుతున్న యాదాద్రి దేవస్థానం ముఖ్య అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఆరంభించిన అన్నదాన యాజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ లో యాదాద్రి ప్రాంతంలో పనులు చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్య పనివారు, వలస కార్మికులు మాధవాచార్యులు ఇచ్చిన అన్న ప్రసాదంతో కడుపు నింపుకుంటున్నారు.

ఆదేవ దేవుడు పంపిన ప్రసాదంగా వారు స్వీకరించి చేతులెత్తి మొకక్కుతున్నారు. తన ఇంట్లో స్వయంగా వండించి పరిశుభ్రంగా ప్యాక్ చేయించి అన్న ప్రసాదాన్ని మాధవాచార్యులు పంపిణీ చేస్తున్నారు. రోజుకు 200 ప్యాకెట్లను ఆయన కుటుంబ సభ్యులు అకుంఠిత దీక్షతో తయారు చేస్తున్నారు.

మాధవాచార్యులు వారు తయారు చేసిన ఆహార పొట్లాలను స్వయంగా తీసుకువెళ్లి ఆకలితో ఉన్నవారికి అందచేస్తున్నారు. యాదగిరి గుట్ట పరిసరాలలో మాధవాచార్యులు అందిస్తున్న అన్న ప్రసాదం ఎందరో పేదలకు నేడు ఆధారంగా మారింది.

లాక్ డౌన్ నేపథ్యంలో బియ్యం పప్పులు కూరగాయలు లభ్యం కావడం కష్టంగా ఉన్నా ఆయన సంకల్పబలం ఈ అన్నదాన యాజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తున్నది.  

Related posts

వైపరిత్యం

Satyam NEWS

రైట్స్:ష‌హీన్‌బాగ్ నిర‌స‌న‌కారుల‌తో సుప్రీం చ‌ర్చ‌లు

Satyam NEWS

నరసరావుపేటలో విజయవంతంగా జాబ్ మేళా

Satyam NEWS

Leave a Comment