జై గౌడ ఉద్యమం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడుగా మాచర్ల మధుసూధన్ గౌడ్ నియమితులయ్యారు. జై గౌడ ఉద్యమ జాతీయ అద్యక్షులు డా వట్టికూటి రామారావు గౌడ్, తెలంగాణ రాష్ట్ర జై గౌడ ఉద్యమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభులింగం గౌడ్ ఈ మేరకు మధుసూదన్ గౌడ్ కు నియామకపత్రం అందచేశారు.
జిల్లాలో గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మధుసూదన్ గౌడ్ తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ఆశించిన మేరకు తన శక్తి వంచన లేకుండా పని చేసి గౌడ కులస్తుల అభ్యున్నతికి పాటుపడతానని మధుసూదన్ గౌడ్ తెలిపారు.