37.2 C
Hyderabad
March 29, 2024 21: 03 PM
Slider ఆదిలాబాద్

అధికార పార్టీ పెద్దల ప్రమేయంతో మధ్యప్రదేశ్ లిక్కర్

#Liquor bottles

ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఉద్దేశ్యంతో తీసుకునే నిర్ణయాలను టీఆర్ఎస్ పార్టీ నాయకులే నిర్వీర్యం చేస్తుంటే ఎలా? ఎవరితో చెప్పుకోవాలి? అధికారులతో చెబుదామంటే వారే కుమ్మక్కయితే? ఇంకేంటి దిక్కు? ఈ ప్రశ్నలన్నీ కొమరం బీమ్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ లో వెచ్చల విడిగా జరుగుతున్న జీరో లిక్కర్ దందా చూసిన వారికి పుట్టుకొస్తున్నాయి.

మధ్య ప్రదేశ్ సరిహద్దుల నుంచి అక్రమ మద్యం ఏరులై తెలంగాణ భూభాగంలోకి ప్రవేశిస్తూనే ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో మద్యం తాగితే ఆ మత్తులో వైరస్ ను ఇతరులకు అంటించే ప్రమాదం ఉంది. అంతే కాకుండా మద్యం తాగిన వాళ్లకు రోగ నిరోధక శక్తి తగ్గిపోయి మృత్యువాత పడతారు.

అందుకే తాగద్దురా నాయనా అంటే మేం తాగం కానీ మందితో తాగిస్తాం అంటున్నారు కాగజ్ నగర్ టీఆర్ఎస్ పెద్దలు. మధ్యప్రదేశ్ నుంచి భారీ కంటైనర్ లో గోధుమ పిండి సంచుల నడుమ పెట్టి రవాణా చేసిన మద్యం బడా బాబులను వదిలేసి చిరువ్యాపారుల మీద కేసులు పెట్టడం ఏమిటని సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రశ్నిస్తున్నారు.

ఆయన ఈ మేరకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు లేఖ రాశారు. మూడు రోజుల క్రింద మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి 600 కార్టన్లలో ఇంపీరియల్ బ్లూ, ఆఫీసర్స్ ఛాయిస్, రాయల్ స్టాగ్ మద్యాన్ని ఒక భారీ కంటెయినర్లో గోధుమ పిండి సంచుల నడుమ ఉంచి స్మగ్లింగ్ చేసి కాగజ్ నగర్ కు తీసుకువచ్చి వివిధ మండలాల్లోని బెల్టు షాపులకు సరఫరా చేశారని ఆయన తెలిపారు.

ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు జడ్పీ వైస్ చైర్మన్ కొడుకు కోనేరు ఉదయ్, కాగజ్ నగర్ కు చెందిన చిన్న గజ్జల శ్రీనివాస్, మున్ని హోటల్ యజమాని కె.వేణు, కౌన్సిలర్ భర్త నవీన్ గౌడ్ అనే వీరందరూ కూడా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ప్రధాన అనుచరులని ఆయన పేర్కొన్నారు.

వీరందరిని వదిలేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు కొండ ను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు చిరువ్యాపారుల మీద కేసులు పెట్టారని అన్నారు. భారీగా ఎక్సైజ్ అధికారులకు ముడుపులు ముట్టినట్లు పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. ప్రధాన సూత్రధారులు నుండి 40 లక్షల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది.

చిరు వ్యాపారులు రాచర్ల వినయ్ ,కంభంపాటి అవినాష్, ఏడుగురు బెల్టు షాపు ఓనర్ల మీద కేసులు బనాయించారు. కేవలం 3 కాటన్ల లిక్కర్ మాత్రమే దొరికిందని చెప్పి కేసు ను నిర్వీర్యం చేశారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ సూపరిండెంట్, ఎక్సైజ్ సీఐని వెంటనే విధుల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

ఆర్ఎంపి,పిఎంపి, గ్రామీణ వైద్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ

Satyam NEWS

బైంస అల్లర్ల బాధితులకు మంత్రాలయ పీఠం బాసట

Satyam NEWS

ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్: చిన్నారి యధిత్య మరణం బాధాకరం

Satyam NEWS

Leave a Comment