37.2 C
Hyderabad
March 29, 2024 18: 11 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

పుట్టిన రోజు కోసం మధ్యప్రదేశ్ ను ముంచేశారు

pjimage (19)

ప్రధాని నరేంద్ర మోడీ తన జన్మదినం జరుపుకోవడానికి మధ్య ప్రదేశ్ లోని కొన్ని ఊళ్లను ముంచేశారని మధ్యప్రదేశ్ హోం మంత్రి బలబచ్చన్ ఆరోపించారు. నర్మదా కంట్రోల్ అథారిటీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మధ్య కాలానికి నర్మదా డ్యామ్ ను నింపాల్సి ఉండగా ప్రధాని మోడీ జన్మ దినోత్సవం సందర్భంగా నమామి నర్మదా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డ్యామ్ ను పూర్తి స్థాయి నీటి మట్టానికి నింపేశారని ఆయన అన్నారు. ఈ కారణంగా నర్మదా డ్యామ్ నుంచి వచ్చే బ్యాక్ వాటర్ తో మధ్య ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయని మంత్రి వివరించారు. సర్దార్ సరోవర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 138.68 మీటర్లు కాగా అంత స్థాయిలో నీటిని నింపేశారని మంత్రి తెలిపారు. ఒక్క సారిగా ఈ విధంగా చేయడంతో మధ్యప్రదేశ్ లోని నాలుగు జిల్లాలు మునిగిపోయారని ఆయన తెలిపారు. బర్వానీ, ధార్, అలిరాజ్పూర్, కొరేగావ్ జిల్లాలలోని 178 గ్రామాలు నర్మద నీటిలో మునిగిపోయాయని మంత్రి వివరించారు.

Related posts

లిక్కర్ కేసు దారి మళ్లించేందుకే కవిత దొంగ దీక్ష

Bhavani

పండుగ పేరుతో ఆవుల కోత ఆపాలి

Satyam NEWS

ములుగు జిల్లా బీసీ సెల్ ఇన్చార్జిగా సురేందర్

Satyam NEWS

Leave a Comment