తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో మాదిగలకు స్థానం కల్పించనందుకు నిరసన లు కొనసాగుతూనే ఉన్నాయి. నేడు అంబర్ పేట్ నియోజకవర్గంలోని గోల్నాక చోరస్తాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్ పిఎస్) పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమo నిర్వహించింది. తెలంగాణ మంత్రి వర్గంలో తక్షణమే మాదిగలకు స్థానం కల్పించాలని, తెలంగాణ లో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు అన్యాయం చేయవద్దని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎడవేల్లి యాదయ్య మాదిగ, బడుగుల బాలకృష్ణ మాదిగ, ఈటా దర్శన్ ప్రసాద్, రంగుల వేణు, రాజేష్, దాస్, కృష్ణ, నర్సింగ్ తదితర mrps కర్యకర్తలు పాల్గోన్నారు.
previous post
next post