32.2 C
Hyderabad
March 28, 2024 22: 52 PM
Slider పశ్చిమగోదావరి

మాదిగలు రాజ్యాధికారం సాధించే దిశగా పోరాడాలి

#mrpseluru

పశ్చిమ గోదావరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అత్యవసర సమావేశం ఏలూరు కండ్రిక గూడెం జిల్లా కార్యాలయం లో నేడు రాష్ట్ర నాయకురాలు నమ్మిన లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి బయ్యారపు రాజేశ్వరరావు పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఎమ్మార్పీఎస్ బలోపేతానికి మహిళలు ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయాలని మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ లో 59 కులాలకు సామాజిక న్యాయం చెయ్యాలని మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో గత 27 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నామని ప్రతి రాజకీయ పార్టీలు మాదిగలను నమ్మించి మోసం చేస్తున్నాయని అన్నారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఏ బి సి డి లు వర్గీకరణ చేస్తానని మాట తప్పారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ లో ఉండే అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ ప్రతిఫలాలు పొందే విధంగా పార్లమెంట్లో చట్టాల సవరణ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం తాడోపేడో చూడ్డానికి ఎమ్మార్పీఎస్ శ్రేణులు మిలిటెంట్ పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఆధిపత్య కులాల పాలనలో బహుజనులకు స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయినా బహుజనుల హత్యలు హత్యచారాలు జరుగుతూనే ఉన్నాయని ఈ హత్యలు అత్యాచారాలు అరికట్టాలంటే బహుజనులు రాజ్యాధికారం దిశగా ముందడుగు వేయాలని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల కలుపుకొని మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మహాజన సోషలిస్టు పార్టీ తెలుగు రాష్ట్రాలలో బలోపేతం చేయాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ల పై ఉందని ప్రతి ఒక్కరు సమిష్టిగా రాజ్యాధికారం దిశగా నడవ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు.

ఈ సమావేశానికి ఏలూరు ఇన్చార్జి దేవరపల్లి రత్నబాబు దెందులూరు ఇన్చార్జి మద్దాల తిరుపతిరావు పెదపాడు మండల ఇంచార్జ్ చోదిమెళ్ళ ప్రసాద్ మండల నాయకులు కొండపల్లి ప్రసాద్ ఎమ్మార్పీఎస్ యువజన నాయకులు కొత్తపల్లి మురళి  సీనియర్ నాయకురాలు నక్షత్రం నక్కపాముల శ్రీను చింతలపూడి హేమలత హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

సమంత వెరీ డెడికేటెడ్ & హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్!

Satyam NEWS

అధికార పార్టీ ఎంఎల్ఏ మాధవరంపై ఐటి దాడులు

Satyam NEWS

అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయం

Satyam NEWS

Leave a Comment