9 నెలలుగా పనిచేస్తున్న తనకు జీతం చెల్లించక పోవడం తో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనో వేదనకు గురై ఓ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.రాష్ట్రంలోని చంఢియా చంఢియా పట్టణంలోని ఓ కళాశాలలో సంజయ్ కుమార్ ప్రొఫెసరుగా పనిచేసేవాడు. తనకు 9 నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
చనిపోయే ముందు ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తన సూసైడ్ నోట్‌లో వ్రాస్తూ అందులో ”నాకు రావాల్సిన జీతం, ప్రావిడెంట్ ఫండ్ నా భార్యకు చెల్లించండి” అంటూ పేర్కొన్నారు. 9 నెలలుగా జీతం లేక తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని పని చేసినా జీతం ఇవ్వకుంటే తామెలా జీవించాలని మృతుడి భార్య ప్రశ్నించారు. ఫీజు చెల్లించనిదుస్థితితో తన పిల్లల్ని స్కూలుకు కూడా పంపించడం లేదని భార్య రోదిస్తూ చెప్పారు.