23.7 C
Hyderabad
March 23, 2023 01: 22 AM
Slider తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి

accedent

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది కూలీలు మృతి చెందారు. కొత్తపల్లికి చెందిన 10 మంది మరణించిన వారిలో ఉన్నారు. సమీపంలోని శివారు గ్రామం గోగ్యా తండాకు చెందిన  కూలీలు   వ్యవసాయ పొలాల్లో  పనిచేసి  తిరుగు ప్రయాణంలో ఆటోలో గ్రామానికి వస్తుండగా… కోదాడ వైపు వెళ్తున్న లారీ ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది మృత్యువాత పడగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను  స్థానికులు పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన వారు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరణించిన వారి వివరాలు: మిడ్జిల్ మండలం కొత్తపల్లికి చెందిన సాలమ్మ (50), వడ్డే చెన్నమ్మ (50), కటికే బాలామని (45), బండారి ఎల్లమ్మ (45), రాగుల శివ లీల (40), చంద్రమ్మ (45), బొల్లె పోగు వెంకటమ్మ (45), బిచాని (40), హెచ్. వెంకటమ్మ (35). మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారు గ్రామం గోగ్యా తండాకు చెందిన సేవ్యా (30), చాంది (35), శివాజీ నాయక్(40)

Related posts

తెలంగాణ కళాకారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు సతీష్

Satyam NEWS

సింహాచలంపై సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు

Satyam NEWS

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు అభినందన

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!