30.2 C
Hyderabad
September 14, 2024 15: 35 PM
Slider ఆధ్యాత్మికం ముఖ్యంశాలు

పితృదేవతలకు ప్రీతికరమైన మహాలయ అమావాస్య

mahalaya

భాద్రపద మాసం బహుళ అమావాస్య అయిన నేడు మహాలయ అమావాస్య. పితృదేవతలను స్మరించుకునే ఈ రోజు శనివారం తో కలిసి వస్తే మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే  మహాలయా అమావాస్య సందర్భంగా  దేశవ్యాప్తంగా పవిత్ర పూజలు జరుగుతున్నాయి. నదీ తీరాలలో పెద్దలకు తర్పణాలు వదులుతున్నారు. ఈ సందర్భంగా పవిత్ర కృష్ణానదీ తీరంలో పలు ప్రాంతాలలో తర్పణాలు వదిలి తమ పితృదేవతలకు సంతృప్తి కలిగించే రీతిలో దానధర్మాలు చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది దేశవ్యాప్తంగా మహాలయా అమావాస్య ను నిర్వహించారు. గయలో లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని రామంతపూర్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ్ లో పితృదేవతలకు శ్రద్ద కర్మలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మఠం మేనేజర్ రమేష్ చారి నిర్వహించారు. దాదాపు ఐదు వందల మంది ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిషులు గద్వాల నగేషశర్మ తదితరులు పాల్గొనడం విశేషం

Related posts

ఒక పోలీసు చెప్పిన కథ: రోగం కన్న భయం ప్రమాదకరం

Satyam NEWS

మోడీ పాలన దేశానికి అరిష్టం

Satyam NEWS

అంతర్గత కుమ్ములాటలతో సక్రమంగా సాగని ‘కారు’

Satyam NEWS

Leave a Comment