మహారాష్ట్రలో ఆకస్మికంగా రాష్ట్రపతి పాలన ఎత్తివేసి హడావుడిగా దేవేంద్ర ఫడణవీస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడంపై శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మహారాష్ట్ర అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తనకు మెజార్టీ ఉందంటూ గవర్నర్‌కు సమర్పించిన లేఖను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భాజపాను గవర్నర్ ఆహ్వానించిన లేఖను తమకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా ఈ రెండు లేఖలను కోర్టుముందుంచాలని చెప్పింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఫడణవీస్, ఉప ముఖ్యంత్రి అజిత్ పవార్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జస్టిస్ ఎన్.వి రమణతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సోలిసిటర్ జనరల్ లేఖలు సమర్పించిన తర్వాతే బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.
previous post