30.7 C
Hyderabad
April 24, 2024 01: 53 AM
Slider గుంటూరు

శివోహం: కుప్పకూలిన అమీన్ సాహెబ్ పాలెం ప్రభ

prabha

గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరుణాళ్లలో 90 నుంచి 100 అడుగుల ప్రభ లు నిర్మించడం ఒక ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ఎంతో కాలం నుంచి కొనసాగిస్తున్న గ్రామాలు లెక్కకు మించే ఉంటాయి. అలాంటి వాటిల్లో అమీన్ సాహెబ్ పాలెం ఒకటి. అమీన్ సాహెబ్ పాలెం ప్రభ అంటే మిగిలిన వారంతా పక్కకు జరిగి తోవ ఇస్తారు.

అడ్డువచ్చే కరెంటు తీగలు చెట్లు క్లియర్ చేస్తారు. అంతటి పెద్ద ప్రభ, ఎత్తైనది ఈ ప్రాంతంలో మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతటి ప్రాశస్త్యం ఉన్న అమీన్ సాహెబ్ పాలెం ప్రభ తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. 100 అడుగుల ప్రభ కుప్పకూలిపోయింది. నేడు జరుగుతున్న శివరాత్రి మహోత్సవంలో ఇది అపశ్రుతి గా చెప్పవచ్చు. ప్రభ కుప్పకూలి పోవడంతో పది మందికి గాయాలయ్యాయి. అమీన్ సాహెబ్ పాలెం నుంచి కోటప్పకొండకు బయలుదేరి మార్గమధ్యంలో ఉండానే ఈ దుర్ఘటన జరిగింది. లేకుండా ఈ ఆకాశాన్ని అంటే ప్రభ ఈపాటికే త్రికోటేశ్వర స్వామి సన్నిధికి చేరి ఉండేది.

Related posts

LRS కట్ట వద్దని TPCC జాయింట్ సెక్రెటరీ అజీజ్ పాషా పిలుపు

Satyam NEWS

పెరుగుతున్న మానవ మృగాలతో సమాజానికి అరిష్టం

Satyam NEWS

యువ‌తను ప‌ట్టించుకోని కేంద్రం

Sub Editor 2

Leave a Comment