35.2 C
Hyderabad
April 20, 2024 15: 58 PM
Slider ప్రపంచం

ఫ్రాడ్ కేసులో మహాత్మా గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష

#mahatma gandhi great grand daughter

మహాత్మా గాంధీ ముని మనుమరాలికి మోసం, ఫోర్జరీ కేసులో ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు.

56 సంవత్సరాల ఆశిష్ లతా రాంగోబింద్ దక్షిణాఫ్రికాలో నివసిస్తుంటారు.

మహాత్మా గాంధీ మనుమరాలు, పౌర హక్కుల సంఘం నాయకురాలు అయిన ఎలా గాంధీ, మెవా రాంగోబింద్ ల కుమార్తె అయిన లతా రాంగోబింద్ అక్కడ ఎగుమతి దిగుమతి వ్యాపారం నిర్వహిస్తుంటారు.

తనకు భారత్ నుంచి వస్త్రాలు, అందుకు సంబంధించిన సరకు రానున్నదని, తనకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నందున డబ్బు సర్దుబాటు చేయాలని ఎస్ ఆర్ మహారాజ నుంచి తీసుకున్నారు.

మహారాజ అక్కడి వ్యాపార సంస్థలకు డబ్బు సమకూరుస్తుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడి పెట్టి అందులో లాభం ఆర్జించడం ఆయన వ్యాపారం.

ఆ విధంగా లతా రాంగోబింద్ కు కూడా ఆయన 6.2 మిలియన్ దక్షిణాఫ్రికా కరెన్సీ అయిన రాండ్ లను ఫైనాన్స్ చేశారు.

భారత్ నుంచి తనకు వచ్చే కంటెయినర్ కు ఇంపోర్టు, కష్టమ్స్ డ్యూటీ క్లియర్ చేసేందుకు ఫైనాన్స్ కావాలని ఆమె చెప్పినప్పటికి అలాంటిదేం లేదని తేలింది.

దాంతో మహారాజ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.

డర్బన్ లోని ఆర్ధిక నేరాల ప్రత్యేక కోర్టు కేసును విచారించి మహాత్మా గాంధీ మునిమనుమరాలికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

Related posts

28న ఎన్టీఆర్ బొమ్మ ముద్రించిన నాణెం ఆవిష్కరణ

Satyam NEWS

ఏపీయూడబ్ల్యూజే జిల్లా సభలకు మీరు రావాలి…!

Satyam NEWS

అజేయ్ కల్లాం అధికారాలు కట్ చేసిన జగన్

Satyam NEWS

Leave a Comment