36.2 C
Hyderabad
April 24, 2024 22: 46 PM
Slider ఆదిలాబాద్

నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలె

#BasaraIIT

నిర్మల్ జిల్లా బాసర లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం SC/ST Cell ఆధ్వర్యంలో  మహాత్మా జ్యోతిరావు పూలె 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంచార్జి  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ సంఘాన్ని సంస్కరించిన మహానీయుల్లో మహాత్మా జ్యోతిరావు పూలె ఒకరిని తెలిపారు.

సాంఘిక అసమానతలతో కూడిన సమాజాన్ని గుర్తించిన పూలె, దీన్ని రూపుమాపేందుకు విద్య ఆయుధమని, స్త్రీకి విద్యావకాశాలు    కల్పించాలని పునుకొని తన భార్య సావిత్రి బా పూలె నే మొదటి ఉపాధ్యారాయులుగా చేసిన ఘనత  ఆ మహనీయుడుదని కొనియాడారు.

అలాగే స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ సతీష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలె  జీవితం ఆదర్శవంతమైన జీవితమని, ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు.

SC/ SC Cell కన్వీనర్ డా.బి.విజయ్ కుమార్ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలె, భారతదేశంలో కులవ్యవస్థ నశించాలని, విద్యాతోనే  సకల సమస్యలు పరిష్కరించబడతాయని, రాజ్యాధికారం రావాలంటే సంఘంటితం కావాలని పేర్కొన్నారు.

సీనియర్ అధ్యాపకులు డా.గోపాల కృష్ణ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో SC/SC Cell కమిటీ సభ్యులు, మిగతా అధ్యాపకులు,ఉద్యోగుల పాల్గొన్నారు.

Related posts

మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అరెస్ట్

Satyam NEWS

ఆర్మీ జవాన్ కి ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూమిని మింగేశారు

Bhavani

కోర్టు ఆదేశాలు పాటించని ఐఏఎస్ లు ఇక జైలుకే

Satyam NEWS

Leave a Comment