భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్ గా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ విషయాన్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె. రవికుమార్ ప్రకటించారు. ఓటర్ల లో చైతన్యం పెంచేందుకు మహేంద్ర సింగ్ ధోని కృషి చేస్తారని ఆయన తెలిపారు. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం ద్వారా ఓటర్లలో అవగాహనను పెంచడానికి ధోని శ్రేష్ఠ ప్రయత్నాలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. మొత్తం 43 నియోజకవర్గాలకు నవంబర్ 13న తొలి దశ పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నామినేషన్ల సమర్పణ ముగిసింది.
previous post
next post