మేఘా తుపాను ప్రభావంతో విజయనగరం కలెక్టరేట్… ప్రాంగణం పాక్షికంగా దెబ్బతింది. ఇటీవలే ఆధునీకరించబడిన ఏఓ ఛాంబర్,అలాగే కలెక్టరేట్ సీసీ ప్రాంగణం జలయమం కాగా… పైన రూప్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లక్షలు పెట్టి… మోడ్రనైజేషన్ చేసిన కలెక్టరేట్ ప్రాంగణం ఖర్చు బూడిదలో పోసిన పన్నీరైనట్టైంది. గత కలెక్టర్ నాగలక్ష్మి…చేతుల మీదుగా ఆధునీకరించబడిన కలెక్టరేట్ ఏఓ ఛాంబర్ ప్రాంగణం పరిసర ప్రాంతం పూర్తిగా జలయమమైంది.శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు…విజయనగరం….తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కుండ పోత వానలు కురుస్తున్నాయి. కాగా గత రాత్రి 10 : 30 గంటల సమయానికి 651.5 మి.మి. వర్ష పాతం నమోదు అయ్యింది. సాధారణ వర్ష పాతం కంటే 439.7 మి.మి.అధిక శాతం నమోదైంది. అత్యధికంగా గుర్ల లో 81.4 మి.మి., విజయనగరం లో 59.6 మి.మి, బొందపల్లి లో 57.6I.మి.మి,గజపతి నగరం 50.6 మి.మి, గరివిడి 39.8 మి. మీ నమోదైంది.కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ విభాగం… తుపాను పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటోంది.
previous post
next post