కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను స్పీడ్ గా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాద మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే కావడం విషాదం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లారు. సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
previous post