34.2 C
Hyderabad
April 19, 2024 22: 12 PM
Slider శ్రీకాకుళం

కరోనా టీకా మందు వస్తేనే పాఠశాలకు పంపుతాం

#SchoolStudents

ఈనెల 21 నుంచి పాఠశాలలు తెరిస్తే పిల్లల్ని పంపుతారా? ఎలా పంపుతాం? చూస్తూ చూస్తూ పిల్లల్ని ప్రమాదంలోకి నెట్టలేం కదా.

కరోనా టీకా మందు వస్తేనే పాఠశాలకు తమ పిల్లలను పంపుతాం అని నిక్కచ్చిగా చెబుతున్నారు తల్లిదండ్రులు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల పట్టణంలో ఉండే మునిసిపల్, గవర్నమెంట్ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే మండల పరిషత్తు, ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలలో  చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విధంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల క్రితం విదేశాలలో బడి ఈడు పిల్లలను పాఠశాలలకు పంపించడం వలన 80 శాతం పైగా  కరోనా వ్యాధి బారిన పడ్డారని తల్లిదండ్రులు అంటున్నారు. చాలా మంది బాల బాలికలు చనిపోయారని  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది.

కరోనా టీకాపై మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వివిధ ఏపిలోని జిల్లాలో రోజుకు 600 నుంచి 800  కరోనా  వ్యాధి బారిన పడుతున్నారని నివేదికలు చెప్తున్నాయి.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు పంపించాలంటే తమ పిల్లల ప్రాణాలకు ఎవరు కాపాడతారని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.

ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా ఈ విద్యాసంవత్సరాన్ని జీరో విద్యా సంవత్సరంగా ప్రకటించాలని కూడా చాలా మంది కోరుతున్నారు.

Related posts

తిరుపతిలో రౌడీ షీటర్ పై పగ తీర్చుకున్నారు

Satyam NEWS

విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు

Satyam NEWS

రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో గోపన్పల్లి విద్యార్థిని

Satyam NEWS

Leave a Comment