40.2 C
Hyderabad
April 19, 2024 16: 17 PM
Slider కడప

మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయండి

#Mahashivratri celebrations

మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి.. ఉత్సవాలను విజయవంతం చేయాలని కడప జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 18న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని.. శనివారం కలెక్టరేట్ లోని వీసి హాలులో.. జిల్లాలోని అన్ని ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై.. జేసి సాయికాంత్ వర్మ, మున్సిపల్ కమిషనర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్, డి ఎఫ్ ఓ సందీప్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్వో గంగాధర్ గౌడ్ .. లతో కలసి జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు సమావేశం నిర్వహించి ఉత్సవ ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ప్రధానంగా పెండ్లిమర్రి మండలంలోని పొలతల శ్రీ మల్లీశ్వర స్వామి దేవస్థానం, సిద్దవటం మండలం వంతాటిపల్లిలోని శ్రీ నిత్యపూజ స్వామి దేవస్థానం, బ్రహ్మంగారిమఠం మండలంలోని కందిమల్లయ్య పల్లిలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం, శ్రీ ఈశ్వరి దేవి మఠం, ప్రొద్దుటూరు మండలంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం, గోపవరం మండలం ఓబులం గ్రామపరిధిలో శ్రీ మల్లెం కొండేశ్వరస్వామి దేవాలయం, చాపాడు మండలం అల్లాడుపల్లిలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం,

బద్వేలు మండలం లంకమల్ల గ్రామంలోని శ్రీ లంకమల్లేశ్వర స్వామి దేవాలయం, మైలవరం మండలంలోని అగస్తికోన లోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం, జమ్మలమడుగు మండలంలోని కన్యతీర్థం నందు గల శ్రీ ఈశ్వర స్వామి దేవాలయం, ఖాజీపేట మండలం లోని పుల్లూరు గ్రామంలోని శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం, సింహాద్రిపురం మండలం, అగ్రహారపురం గ్రామంలోని శ్రీ భానుకోటేశ్వర స్వామి దేవస్థానం… మొదలయిన శైవక్షేత్రాల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని.. వారందరికీ ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబందిత ఆలయాల ఈఓలను ఆదేశించారు.

ప్రతి క్షేత్రం వద్ద ఖచ్చితంగా పిఎ సిస్టం, కమాండ్ కంట్రోల్ రూమును ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ పనులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సదరు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని ఆలయాల వద్ద క్యూలైన్ల బ్యారికేడింగ్, బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా ప్రణాళికలు రూపొందించి, అవసరమైన చోట అధిక పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు.

ప్రతి శైవక్షేత్రం వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, వైద్య శిబిరం, 108, 104 వాహనాలు, అగ్నిమాపక శిబిరం ఏర్పాటు చేయాలనీ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్ళే రహదారులన్నీ బాగుండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల ముళ్ళపొదల తొలగింపు, రహదారుల మరమ్మతులు చేయాలనీ ఆర్ అండ్ బి, పంచాయతిరాజ్, అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

ట్రాఫిక్, బందోబస్తులను ప్రణాళిక ప్రకారం చేపట్టాలని పోలీస్ శాఖ, రవాణాశాఖ అధికారులను, అవసరమైన మేర బస్సులు ఏర్పాటు చేయాలనీ ఆర్టీసి వారిని, ఆలయాల బయటి ప్రదేశాలలో పారిశుద్ధ్య నిర్వహణ చక్కగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి చోటా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతి, మునిసిపల్ అధికారులకు సూచించారు. గత సంవత్సరం ఉత్సవాలలో ఎదుర్కొన్న సమస్యలపై దృష్టి సారించాలని, ముఖ్యంగా ద్వి చక్ర, ఫోర్ వీలర్ వాహనాలు, బస్సులు తదితరాల పార్కింగ్ ప్రదేశాలు, త్రాగునీటి, శానిటేషన్ ఏర్పాట్లు తదితరాలలో తీసుకోవాల్సిన చర్యలపై తహశీల్దార్లు,

ఎంపిడివో, పోలీస్, అటవీ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, టెంపుల్ ఈఓలు సంయుక్తంగా వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాలన్ని ఆయా డివిజన్ స్థాయి సబ్ కలెక్టర్లు, ఆర్దిఓ లు తగు విధంగా పర్యవేక్షణ చేయాలనీ కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత ఆర్డీవోలు వారి పరిధిలో ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించాలని అలాగే తహశీల్దార్లు వారి పరిధిలో ఉన్న దేవాలయాల వద్ద సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాట్లపై సమీక్షించుకోవాలన్నారు.

జేసి సాయికాంత్ వర్మ మాట్లాడుతూ.. శివరాత్రి ఉత్సవాల నిర్వహణలో భాగంగా విద్యుత్తు తీగలు బాగా ఎత్తులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్తు అధికారులను ఆదేశించారు. ప్రతి మేజర్ దేవాలయం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అనౌన్స్ మెంట్స్ చేయాలన్నారు. ముఖ్యంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మహా శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను వారు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు, బద్వేల్, పులివెందుల ఆర్డిఓలు శ్రీనివాసులు, వెంకటరమణ, వెంకటేశ్వర్లు , కడప డిఎస్పీ బి.శివారెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ శంకర్ బాలాజీ, పంచాయతీ రాజ్ ఎస్ ఈ శ్రీనివాస రెడ్డి, రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్ బి, విద్యుత్తు, వైద్య ఆరోగ్య, రవాణా, ఏపీఎస్ ఆర్టీసీ, ఎక్సైజ్ మునిసిపాలిటీ, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు, టెంపుల్ ఈఓలు మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు

Bhavani

బిచ్కుందలో మార్కండేయ జయంతి వేడుకలు

Satyam NEWS

అన్న‌కూటంతో ముగిసిన బంగారు అన్న‌పూర్ణ ద‌ర్శ‌నం

Satyam NEWS

Leave a Comment