Slider సినిమా

కంప్లయింట్: మలాలా చిత్ర దర్శకుడికి ఫత్వా

malala

పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్జాయ్ జీవిత చరిత్ర ను సినిమాగా రూపొందింస్తున్న దర్శకుడు హెచ్ ఇ అంజాద్ ఖాన్ పై ఫత్వా జారీ అయింది. పాకిస్తాన్ లో బాలికల విద్యపై విస్త్రత ప్రచారం చేస్తున్న మలాలా తాలిబాన్లకు టార్గెట్. ఆమెపై తాలిబాన్లు దాడి చేసి హత్యాయత్నం చేశారు. అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డ మలాలా ఆ తర్వాతి కాలంలో బాలికల విద్యకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. అతి పిన్న వయసులో నోబుల్ బహుమతి పొందిన మలాలా ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అటువంటి మలాలా జీవితం ఆధారంగా నిర్మిస్తున్న హిందీ చిత్రం గుల్ మకాయ్. ఈ చిత్రం ప్రారంభం అయి నాటి నుంచి దర్శకుడికి హత్య బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి.

అయినా వాటిని ఖాతరు చేయకుండా అతడు చిత్రాన్ని పూర్తి చేశాడు. చిత్రంలో ఒక సన్నివేశం ఉంది. అదేమిటంటే వెనుక బాంబులు పేలుతుంటే మలాలా చేతిలో ఒక పుస్తకం పట్టుకుని ఉంటుంది. ఈ సన్నివేశాన్ని వాల్ పోస్టర్ గా ముద్రించారు. మలాలా చేతిలో ఉన్న పుస్తకం ఖురాన్ అని, ఖురాన్ కు అపచారం చేసినందుకు ఫత్వా జారీ చేస్తున్నానని నోయిడా కు చెందిన ఒక ముస్లిం మత ప్రబోధకుడు ఆయనకు ఫత్వా జారీ చేశారు. అయితే ఆ సన్నివేశంలో మలాలా చేతిలో ఉన్నది ఖురాన్ కాదని, అది ఒక ఇంగ్లీష్ పుస్తకం అని దర్శకుడు చెబుతున్నాడు కానీ వినేవారు ఎవరు?

Related posts

అరవింద్ కాటన్ మాస్కుల అందజేత

Sub Editor

నా ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఉంటుంది

Satyam NEWS

ఎనదర్ డేంజర్: చిట్యాలలో కరోనా కలకలం

Satyam NEWS

Leave a Comment