26.2 C
Hyderabad
February 14, 2025 00: 10 AM
Slider ప్రత్యేకం

న్యూ ప్రాబ్లమ్: అడ్డు తప్పుకోండి అయ్యప్ప మా దేవుడు

malaya araya

అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదం కొనసాగుతుండగానే మరో వివాదం వెల్లువలా వస్తున్నది. కేరళలోని కొండ ప్రాంతాలలో నివసించే మలయా అరయ అనే కొండజాతి గిరిజనులు అయ్యప్ప దేవాలయంపై హక్కులను కోరుతున్నారు.

వేల సంవత్సరాలుగా అయ్యప్ప దేవాలయం తమ ఆధీనంలో ఉండేదని అయితే 1800 లో రాజా పాండలం తమను ఆ ప్రాంతం నుంచి తరిమేసి ఆలయాన్ని సాధ్వీనం చేసుకున్నారని గిరిజనులు అంటున్నారు. శబరి మలలోని 17 కొండలపై ఆధిపత్యం తమదేనని వారు అంటున్నారు. అయ్యప్ప తమ దేవుడని తమను వెళ్లగొట్టి దేవాలయాన్ని కొండలను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని వారు అంటున్నారు.

తక్షణమే ఆలయాన్ని తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మకర జ్యోతిని వెలిగించే ఆచారాన్ని తమ పూర్వీకులు ఎన్నో ఎళ్లుగా కొనసాగించారని, దాన్ని ఆలయ కమిటీ స్వాధీనం చేసుకుని తమకు గెంటివేసిందని వారు ఆరోపిస్తున్నారు. అయ్యప్ప దేవాలయ కమిటీ చేసిన చర్యలకు నిరసనగా తమ తమ ఇళ్లపై మకరజ్యోతిని వెలిగించాని వారు పిలుపునిచ్చారు.

ట్రావెన్ కోర్ దేవాస్వం బోర్డు 1950 నుంచి ఆ ఆలయాన్ని నిర్వహిస్తున్నది. కొల్లాం, పతనమిట్ట, తిరువనంతపురం లోని దిగువ కులాల ప్రజలు కూడా మలయా అరయ్యల వారసత్వానికి మద్దతు ప్రకటించారు. శబరిమలతో సహా మొత్తం 18 కొండలు అరయన్ సమాజానికి చెందినవని మలయా అరయ మహాసభ పేర్కొంది. 

శబరిమల, పొన్నంబలమేడు, గౌండర్మల, నాగమల, సుందరమాల, చిత్తంబలమడే, ఖల్గిమల, మదంగమల, మైలాడుమ్ మేడు, శ్రీపదమాల, దేవర్మల, నీలకల్మల, తలప్పరమలై, నీలిమల, కరిమమల, పుడసమాల, పుడసమాల, పుడసమల, పుడసమల, పుడసమల లాంటి  18 కొండలు వారి ఆధీనంలో ఉండేవి. ఉడుంబరమలై శిఖరం వద్ద మలయా సమాజం తన హక్కుల పునరుద్ధరణ కోసం 2563 రోజులు గా పోరాటం చేస్తున్నది.

Related posts

నాగర్ కర్నూల్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా చంద్రకళ

Satyam NEWS

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ ఆదాల స్వాగతం

Satyam NEWS

హుజూర్ నగర్ లో ఘనంగా ఐ ఎన్ టి యు సి ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment