37.2 C
Hyderabad
March 29, 2024 19: 25 PM
Slider ఆధ్యాత్మికం

ఘనంగా మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

#maldakal

జోగులాంబ గద్వాల జిల్లా లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గిరీశాచల క్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. తంబిహళ్లి పీఠాధిపతులు శ్రీ విద్యా సింధు మాధవ తీర్థుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ రాజారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి, సర్పంచ్ యాకోబు హజరు కాగా దేవాలయంలో పూజలు నిర్వహించి అఖండ జ్యోతిని వెలిగించి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కలియుగ వైకుంఠముగా భక్తుల కోరికలు తీర్చే మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి క్షేత్రము అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగాలని స్వామి తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి పంటల సమృద్ధిగా పండి ప్రజల సుభిక్షంగా ఉండాలని స్వామీజీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వామీజీ భక్తులను ఆశీర్వదించారు.

అనంతరం బ్రహ్మోత్సవాలకు అవసరమయ్యే కుండలు తీసుకువచ్చేందుకు మేళ తాళాలతో కుమ్మరి వీధికి వెళ్లి వచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, సీతారామరెడ్డి, మధుసూదన్ రెడ్డి, బాబు రావు, చంద్రశేఖర రావు పద్మారెడ్డి, తూ ము కృష్ణారెడ్డి వెంకటన్న, బాదామి శ్రీనివాసులు, మద్దెలబండ నాగరాజు, మనసాని నాగరాజు, సీకిన మల్దకల్, ఎంపిటిసి నరసింహులు, అజయ్, నరేందర్ నాయకి మధు ఉప్పరి నారాయణ, పరుష, అమృత్ కుమార్, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికం

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంత విద్యార్ధులకు పుస్తకాలు పంచిన చింతలపల్లి

Satyam NEWS

అందరి కళ్లూ హైకోర్టు వైపే చూస్తున్నాయి

Satyam NEWS

Leave a Comment