చిత్ర దర్శకులు లక్ష్మణ్ మురారి ఆలోచనలో మెదిలిన “తెలంగాణ బ్రీత్ లెస్ సాంగ్” ను, గేయ రచయిత గోరేటి వెంకన్న, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ , గాయకుడు సాకేత్ కోమండురి కలిసి చేసిన “పూసిన పున్నమి వెన్నెలమేన (తెలంగాణ బ్రీత్ లెస్ సాంగ్) పాటకు 10 సంవత్సరాల తర్వాత కూడా మలేసియాలోని ప్రతిష్టాత్మక వేదికపై అరుదైన గౌరవం దక్కింది. మలేసియా ప్రధానమంత్రి కార్యాలయ సభ్యులు, తెలంగాణ రాజకీయ ప్రముఖులు, చీఫ్ జస్టిస్’లు, రచయితలు, మేధావులు, సినీ నటినటులు, సామాజికవేత్తలు పాల్గొన్న ఈ భారీ ఉత్సవంలో మలేసియా ప్రెసిడెంట్ ఆఫీసు నుండి విచ్చేసిన సెక్రటరీ “దాటో రోమ్లి ఇషాక్” చేతుల మీదుగా “బందూక్” దర్శకులు లక్ష్మణ్ మురారిని “మైటా దశాబ్ది అవార్డు”తో సత్కరించారు.
previous post