38.2 C
Hyderabad
April 25, 2024 14: 20 PM
Slider రంగారెడ్డి

చెత్తరహిత డివిజన్ గా మల్లాపూర్ ను తీర్చిదిద్దాలి

#mallapur

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మల్లా పూర్ డివిజన్ ను రెండు నెలల్లో చెత్తరహిత డివిజన్ తీర్చిదిద్దాలని, అలా చేస్తే శానిటేషన్ సిబ్బందికి నగదు ప్రోత్సాహంగా 10 వేలు ఇస్తానని జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ప్రకటించారు.

గురువారం మల్లాపూర్ వార్డు కార్యాలయంలో కాప్రా సర్కిల్ ఏఎమ్ హెచ్, శానిటేషన్ అధికారులు, సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణపై సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కాలనీలలో, బస్తీ చౌరస్తా కూడలిలో చెత్తను వెయ్యకుండా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిరోజు కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యమవుతుందని కార్పొరేటర్ అన్నారు.

పారిశుధ్య సిబ్బందికి డివిజన్ ప్రజలు సహకరించాలని కోరారు. ఇష్టారీతిగా చెత్తను పారవేయొద్దని సూచించారు. ఈ సమావేశంలో కాప్రా సర్కిల్ ఎమోచీ డాక్టర్ శ్రీనివాస్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, జవాన్లు యాదగిరి, ప్రభాకర్, ఎస్ఎఫ్ఎస్ఐలు లక్ష్మి, స్వప్న, లలిత, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

న్యాయవాద దంపతులను హత్య చేసిన వారిని శిక్షించాలి

Satyam NEWS

వరి పొలంలో కలుపు తీసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

అవసరం మేరకు కేటాయింపులు

Murali Krishna

Leave a Comment