30.7 C
Hyderabad
April 24, 2024 01: 44 AM
Slider జాతీయం

వ్యక్తి ఆరాధనకు పరాకాష్ట: దుర్గా మాత పక్కన దీదీ విగ్రహం

#mamatabenarjee

వ్యక్తి ఆరాధనకు పరాకాష్ట: దుర్గా మాత పక్కన దీదీ విగ్రహం వ్యక్తి ఆరాధన దరిద్రం పట్టుకున్న భారత దేశంలో ఆ వెర్రి వేయి రీతులుగా విజృంభిస్తున్నది. దసరా నవరాత్రులకు దుర్గాదేవిని పూజించడం ఆనవాయితీ. అందుకోసం వైభవంగా తొమ్మిది రోజుల పండుగ జరుపుకుంటారు.

అదేం దరిద్రమో గానీ పశ్చిమ బెంగాల్ లో దుర్గాదేవితో బాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన కొందరు ప్రయత్నిస్తున్నారు. కోల్ కతాలో పది చేతులతో ఉన్న మమత విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆమె పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు.

ఈ పది చేతుల్లో వివిధ రకాలైన ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్లను ఉంచనున్నారు. దేవత  పది చేతులు, ఆయుధాలను పట్టుకునే బదులు, కన్యాశ్రీ, స్వస్థ సతి, రూపశ్రీ, సబుజశతి, లక్ష్మీర్ భండార్ వంటి ప్రభుత్వ పధకాలను చిత్రీకరిస్తున్నారు. ఆమె ప్రభుత్వం ప్రారంభించిన వివిధ ప్రజాదరణ పొందిన అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.

మమత ఫైబర్‌గ్లాస్ విగ్రహం పక్కన, దుర్గ మట్టి చిత్రం పూజకు ఉంచుతారు. “మొత్తం పండాల్ లక్ష్మీర్ భండార్ నేపథ్యంగా ఉంటుంది” అని నగరంలోని ఉత్తర ప్రాంతంలో కేష్టోపూర్ వద్ద ఉన్నయన్ సమితి క్లబ్ ద్వారా జరుపుతున్న పూజ నిర్వాహకులు చెప్పారు. లక్ష్మీర్ భండార్ అనేది ప్రభుత్వం ప్రారంభించిన ఒక ఆదాయ మద్దతు పథకం.  దీని కింద ప్రతి ఇంటిలో మహిళా పెద్దకు  నెలకు 500-1,000 రూపాయల సహాయం లభిస్తుంది.

‘‘మేము దుర్గామాతకు పూజలు చేస్తాం. దుర్గామాత బెంగాల్ గౌరవం. అయితే వాటికంటూ కొన్ని విధివిధానాలు ఉంటాయి. అవి కాకుండా కొందరు కొన్ని వింత పద్దతుల్లో కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. తాను సెక్యూలర్‌ని అని చెప్పుకునే ఓ మహిళ తరుచూ పశ్చిమ బెంగాల్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు. బెంగాల్ సంప్రదాయానికి, సంస్కృతికి అవి తగిన చర్యలు కావు’’ అని మమతా బెనర్జీని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు.

Related posts

కొడుకును అడ్డుకున్నందుకు పోలీసులతో ఎంపీ గొడవ

Satyam NEWS

కేసిఆర్ జనరంజక పాలనకు యావత్ దేశం ఫిదా

Satyam NEWS

కేటీఆర్ జన్మదిన సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment