27.7 C
Hyderabad
April 20, 2024 01: 18 AM
Slider వరంగల్

రివర్స్:మాజీ ప్రియుని హత్య కేసులో 4 గురి అరెస్ట్

mamunoor police arrested 4 members in old lover murder

తాను వడ్ఢనంటున్న వెంబడి పడుతూ ఇబ్బందులు పెడుతున్న మాజీ ప్రియుడిని హత్య చేసి ఆక్సిడెంట్ గా చిత్రించాలనుకున్న కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మామునూర్ పోలీసులు తెలిపారు.. వరంగల్ అర్బన్ జిల్లాలో సంచలనం సృటించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు ఛేదించారు.మొత్తం ఐదుగురు నిందితుల్లో ఒక్కరు పరారీ కాగా నలుగురిని రేమాండ్కు పంపుతున్నట్లు డిసిపి నాగరాజు తెలిపారు.

అయన విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామ నివాసి అయిన బండపల్లి అశోక్ (40) అను అతనికి వివాహం అయ్యి ఒక కుమార్తె పుట్టిన తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి గత 20 సంవత్సరాలుగా విడిపోయి,అశోక్ ఒంటరిగా ఉంటుందేవాడు, అదేవిధంగా వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామస్తురాలు అయినా దద్దు అనితకు వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలకు భర్త చనిపోయినాడు అనిత తన తల్లిదండ్రుల వద్ద ఊకల్ గ్రామంలో ఉంటుండగా అనిత మరియు అశోక్ కు పరిచయం వివాహేతర సంబంధం గా మారింది.

కొన్ని రోజులకు వారిద్దరి మధ్య విభేదాలు వచ్చి అనిత అశోక్ ను దూరం పెట్టింది. అశోక్ అనితను ఎంతకు వదిలిపెట్టకపోయేసరికి ఎలాగైనా అశోక్ ను అనిత తన కుటుంబ సభ్యులైన తండ్రి జిట్టబొయిన ఐలయ్య మరియు తమ్ముడు జిట్టబోయిన రాజు చిన్నమ్మ కొడుకు రాజారపు రాకేష్ , చెల్లెలి భర్త గడ్డం సాగర్ లో తో పథకం వేసుకుని ఈ నెల 12 రాత్రి ఒంటిమామిడి పల్లి లోని అనిత కిరాయికి ఉంటున్న ఇంటికి అశోక్ వస్తాడని ముందస్తు సమాచారం అనిత తన బంధువులకు చేరవేయగా అదే రోజు రాత్రి పైన చూపిన నలుగురు వ్యక్తులు 11గంటలకు అనిత

ఉంటున్న ఇంటికి అశోక్ రావడంతో కర్రలతో వచ్చి అశోక్ తలపై కొట్టి హత్య చేసి మృతదేహాని మృతుడి ద్విచక్రవాహనంపై వేసుకొని వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామ సమీపంలోని రోడ్డుపై శవాన్ని పెట్టి ప్రక్కనే ద్విచక్రవాహనం పడవేసి ఇట్టి సంఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోయినారు ఈ క్రమంలో మామునూర్ సీఐ రాజు సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పదoగా కేసు నమోదు చేసుకొని

విచారణ జరపగా పధకం ప్రకారం హత్య చేశారు అని నిర్దరించుకోని ఆ కోణంలో విచారణ జరపగా సోమవారం ఐదుగురు నిందితులో నలుగురు నిందితులు అరెస్టు చేసినట్లు మరో నిందితులలో ఒకరైనా గడ్డం సాగర్ పరారీలో ఉన్నారు. నిందితుల నుండి నాలుగు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం మరియు కర్ర లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శ్యాసుందర్, సీఐ రాజు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Related posts

ధర్డ్ వికెట్: యనమల రామకృష్ణుడిపై ఎస్ సి ఎట్రాసిటీ కేసు

Satyam NEWS

ఖమ్మం రానున్న కేరళ సీఎం పినరయ్ విజయన్

Satyam NEWS

నాలుగు సంవత్సరాలు గడిచినా నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయరా?

Satyam NEWS

Leave a Comment