36.2 C
Hyderabad
April 25, 2024 20: 46 PM
Slider జాతీయం

హర్యానాలో 12 పిస్టల్స్ లభ్యం

గన్స్‌తో చెలరేగుతున్న హర్యానా రాష్ట్రం కన్వా గ్రామంలోని రెండు గ్యాంగ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కపిల్‌ సంగ్వాన్‌, అలియాస్‌ నందు గ్యాంగ్‌.. జ్యోతిబాబా గ్యాంగ్.. ఈ రెండు గ్యాంగ్‌లను పట్టుకున్న పోలీసులు వారి నుంచి 12 పిస్టల్స్‌తోపాటు 47 కాట్రిడ్జ్‌లను, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరగడంతో ఇలా అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు.

అయితే.. ముందు పోలీసులను చూసిన ఒక నిందితుడు.. కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో గ్యాంగ్‌ సభ్యుడు గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పట్టుబడ్డ గ్యాంగ్‌ సభ్యులను లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గతంలో ఈ ప్రాంతంలో ఎలాంటి నేరాలు చేశారు…? ఈ గ్యాంగ్‌కు పొలిటికల్‌ సపోర్ట్‌ ఉందా..? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ గ్యాంగ్‌కు తుపాకులు ఎలా చేరాయి..మరేవైనా గ్రూపులు ఉన్నాయా…అని విచారిస్తున్నారు. అయితే.. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ మంజీత్ మహల్ నేతృత్వంలో.. ప్రత్యర్థి ముఠా సభ్యులను పట్టుకోవడానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Related posts

మాదిగ విశ్వరూప సభ విజయవంతం చేయాలి

Satyam NEWS

తక్షణమే చెరువులు నింపాలి: ఏపి సిఎం ఆదేశం

Satyam NEWS

తుంగభద్రలో పుణ్య‌స్నానం ఆచ‌రించిన మంత్రులు

Satyam NEWS

Leave a Comment