34.2 C
Hyderabad
April 19, 2024 19: 43 PM
Slider మహబూబ్ నగర్

మన ఊరు మన బడి కార్యక్రమం పనులు వేగవంతం చేయాలి

#manuchowdaryias

మన ఊరు మన బడి కార్యక్రమము కింద మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలలకు సంబందించిన పనులను ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల విద్యా శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మండలాల వారిగా సమీక్ష నిర్వహించి వివరాలు అడిగారు.  మొదటి విడతలో జిల్లాలో మొత్తం 290 పాఠశాలలు ఎంపిక చేసుకోగా  ఇప్పటివరకు కేవలం 57 కు సంకేతిక ఆనుమతి మంజూరు అయ్యాయన్నారు.  ఇంకా డాటా నమోదు చేయాల్సినవి దాదాపు 23 వరకు ఉన్నాయని, 266 పాఠశాలలకు డాటా ఇన్ ఫుట్ పూర్తి అయ్యిందన్నారు.

ఏ.ఈ. ల నుండి డి. ఈ లాగిన్ కు డి.ఈ నుండి ఈ.ఈ అనంతరం పరిపాలన అనుమతి కొరకు జిల్లా కలెక్టర్ లాగిన్ కు పంపాల్సి ఉంటుంది కాబట్టి ఆయా స్థాయిల్లో ఆన్లైన్ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు.  శిథిలావస్థలో ఉన్న గదుల స్థానంలో కొత్త గదుల నిర్మాణం, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, మరుగుదొడ్లు వంటి  ఉపాధిహామి ద్వారా చేపట్టాల్సిన పనుల ఆన్లైన్ నమోదు త్వరగా పూర్తి చేయాలని తెలియజేసారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజులు, ఈ.ఈ. పి.ఆర్. దామోదర్ రావు, ఈ.ఈ ఆర్ అండ్ బి భాస్కర్, డి.ఈ లు, ఏ.ఈ లు, ఎం.ఈ.ఓ లు, ఈ.డి.యం. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, రిపోర్టర్ సత్యం న్యూస్ నెట్, నాగర్ కర్నూల్

Related posts

పోలీసుల సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS

దళితులకు జగన్ చేసింది ఏమిటి?

Satyam NEWS

తుంగతుర్తి నుంచి పోటీ చేస్తా

Bhavani

Leave a Comment