Slider ఆదిలాబాద్

డెత్ హంటర్స్: విద్యుదాఘాతానికి ఎంపీటీసీ బలి

mptc shocked to death

జంతువుల కోసం వేటగాళ్లు పెట్టిన విద్యుదాఘాతానికి యువనాయకుడు, స్థానిక ప్రజాప్రతినిధి బలయ్యాడు. మందమర్రి మండలం, మామిడిగట్టు వద్ద చిర్రకుంట గ్రామానకి చెందిన ఎంపీటీసీ ఆసిఫ్‌(25) కరెంట్‌షాక్‌ తగిలి మరణించాడు.తన పొలానికి వెళ్తుండగా అడవిలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి ఆసిఫ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా, అడవిలో పందులు, కుందేళ్ల కోసం వేటగాళ్లు ఈ విద్యుత్‌తీగలు అమర్చినట్లు సమాచారం. వాటిని గమనించని ఆసిఫ్‌ విద్యుత్‌కు బలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విద్యుత్‌ తీగలు అమర్చిన వేటగాళ్ల కోసం గాలిస్తున్నారు.

Related posts

నరసరావుపేటలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

టర్కీ-సిరియాలో మరోసారి భూకంపం

Satyam NEWS

Delhi Liquor Scam: ఆంధ్రప్రభ ఆఫీసులో ఈడీ సోదాలు

Satyam NEWS

Leave a Comment